కొందరు యజమానులు తమ కుక్కలను చాలా గారాబంగా చూసుకుంటారు.వాటిని ఒక కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేస్తారు.
బర్త్ డే పార్టీలు కండక్ట్ చేస్తారు.అయితే తాజాగా రోజీ అనే గర్భిణి కుక్కకు దాని యజమాని సీమంతం చేశారు.
వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా సదరు యజమాని కుక్కకి చాలా స్పెషల్‌గా సీమంతం చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.రోజీ యజమాని ఈ సీమంతం ఫోటోలను సోషల్ మీడియా( Social media )లో పంచుకున్నారు.
అవి వైరల్ అయ్యాయి.రోజీ కుటుంబం దానిని ఎంతగా ప్రేమిస్తుందో చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్( Instagram )లో రోజీ సీమంతం వీడియో వైరల్ అయింది.అందులో ఒక యువతి కుక్క చుట్టూ ఎర్రటి కండువా వేయడం చూడవచ్చు.అప్పుడు రోజీ నిశ్శబ్దంగా కూర్చింది.కుక్క నుదుటిపై బిందీ, కాళ్ళకు గాజులు కూడా వేసింది.తరువాత, దానికి పూల రేకులతో వర్షం కురిపించింది.
తర్వాత, రోజీకి కొన్ని రుచికరమైన స్నాక్స్ అందించింది.ఈ కుక్క పక్కనే రేమో అని మరో కుక్క ఉంది.ఈ వీడియో చూసేది చాలా అద్భుతంగా ఉంది.
అందుకే ఈ సీమంతం( Baby shower ) వీడియోకు షేర్ చేసిన కొంత సమయానికి 30 లక్షల వరకు వ్యూస్, 3 లక్షల వరకు లైక్స్ వచ్చాయి.ఇంటర్నెట్‌లోని వ్యక్తులు ఈ వీడియోను ఇష్టపడ్డారు.రోజీ, ఆమె కుక్కపిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ అనేక వ్యాఖ్యలు చేశారు.“ఇది చాలా అందంగా ఉంది.కుక్కపిల్లలను చూసేంతవరకు వెయిట్ చేయలేకపోతున్నాం!, ఈరోజు ఇంటర్నెట్‌లో క్యూటెస్ట్ వీడియో ఇదే, ఈ కుక్క ఎంత సంతోషంగా ఉందో చూడండి.” అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.