అస‌లు యోయో టెస్ట్ అంటే ఏమిటి? క‌్రికెట‌ర్స్ కి దీనికి సంబంధ‌మేమిటి?

భార‌త క్రికెట్ ఆట‌గాళ్ల ఫిట్‌నెస్ స్థాయిల‌ను ప‌రీక్షించ‌డం కోసం బీసీసీఐ ఎప్ప‌టి నుంచో యోయో టెస్టును నిర్వ‌హిస్తూ వ‌స్తోంద‌ని అంద‌రికీ తెలిసిందే.యోయో టెస్టులో పాస‌వ్వాలంటే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అందులో చేయాల్సిన‌ క‌నీస స్కోర్ల‌ను నిర్ణ‌యించాయి.ఈ మేర‌కు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయ‌ర్ల‌కు ఈ స్కోరు 19 ఉండ‌గా, సౌతాఫ్రికాకు 18.5, శ్రీ‌లంక‌, పాకిస్థాన్‌ల‌కు 17.4 గా ఈ స్కోరు ఉంది.అదే భార‌త ప్లేయ‌ర్ల విష‌యానికి వ‌స్తే యోయో టెస్టులో పాస‌వ్వాలంటే క‌నీసం 16.1 మార్కుల‌ను అందులో సాధించాల్సి ఉంటుంది.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టెస్టులో అత్య‌ధిక పాయింట్లు స్కోర్ చేసిన ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా.? అదే ఇప్పుడు చూద్దాం.

 What Is The Yo Yo Test-TeluguStop.com

పాకిస్థాన్ క్రికెట్ ప్లేయ‌ర్ హ‌స‌న్ అలీ ఇప్ప‌టి వ‌ర‌కు యోయో టెస్టులో అత్య‌ధికంగా 20 మార్కులు స్కోర్ చేయ‌గా, భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇందులో 19 పాయింట్లు వ‌చ్చాయి.అదేవిధంగా మ‌రో భార‌త ప్లేయ‌ర్ మ‌నీష్ పాండేకు యోయో టెస్టులో 19.2 మార్కులు వ‌చ్చాయి.ఇక ఐపీఎల్ పంజాబ్ టీం ప్లేయ‌ర్ అయిన మ‌యాంక్ ద‌గర్‌కు 19.3 పాయింట్లు యోయో టెస్టులో వ‌చ్చాయి.

అయితే క్రికెట్ కాకుండా చూస్తే ఓ భార‌త హాకీ ప్లేయ‌ర్‌కు యోయో టెస్టులో గ‌త నాలుగేళ్ల కింద‌ట 21.4 స్కోరు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.కాగా విరాట్ కోహ్లి యోయో టెస్టులో 21 పాయింట్లు సాధించిన‌ట్లు గ‌తంలో ప‌లు వార్త‌లు వ‌చ్చాయి.కానీ అధికారికంగా ఆ వివ‌రాలు మాత్రం ఎక్క‌డా న‌మోదు కాలేద‌ని తెలుస్తోంది.

అలాగే ఫుట్‌బాల్‌లో మ‌లేషియాకు చెందిన డి.కెన్నీ పాల్‌రాజ్ అనే ప్లేయ‌ర్‌కు యోయో టెస్టులో అత్య‌ధికంగా 22.4 పాయింట్లు వ‌చ్చాయ‌ట‌.ఏది ఏమైనా యోయో టెస్టు పాస‌వ్వ‌డం అంటే అంత ఆషామాషీయేం కాదు క‌దా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube