హుజూరాబాద్‌లో కామ్రేడ్ల దారి ఎటు.. మ‌ద్ద‌తు కోసం ఆ రెండు పార్టీల ఆశ‌లు

జోరుగా స‌భ‌లు, స‌మావేశాలు, ఊరూరా ప్ర‌చారాల‌తో ఇప్పుడు హోరెత్తిస్తోంది హుజూరాబాద్ రాజ‌కీయం.అన్ని పార్టీల అధినేత‌లు అక్క‌డే త‌మ ఫోక‌స్ పెట్టారు.

 What Is The Way Of Comrades In Huzurabad .. The Hopes Of Those Two Parties For S-TeluguStop.com

బ‌లాబ‌లాల మీద ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు నిర్వ‌హించుకున్నాయి అన్ని పార్టీలు.ఒక్క పార్టీకి ఒక్కో విధ‌మైన రిపోర్టులు రావ‌డంతో అంద‌రూ వాటిని బేరీజు వేసుకుని బ‌లం పెంచుకునే విధంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

దీంతో అన్ని పార్టీలు ఇత‌ర వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు కోసం బ‌లంగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలోనే కామ్రేడ్ల దారి ఎటు అనే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

కామ్రేడ్లు ఎప్పుడూ కొంచెం డిఫ‌రెంట్‌గానే ఉంటారు.వారు కేంద్రంలో వ‌చ్చే స‌రికి కాంగ్రెస్‌కు స‌పోర్టుగా ఉంటారు.అదే రాష్ట్రం విష‌యానికి వ‌స్తే మాత్రం చాలాసార్లు టీఆర్ ఎస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు.మ‌రి ఇలా ఎందుకు అని అడిగితే మాత్రం స‌రైన స‌మాధాన రాదు.

సీపీఎం, సీపీఐ ఎప్పుడు క‌లిసి ప‌నిచేస్తాయో ఎప్పుడు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తాయో ఎవ‌రికీ తెలియ‌దు.ఇక ఈట‌ల రాజేంద‌ర్ లెఫ్ట్ పార్టీ నేప‌థ్యం ఉన్న నేత అయినా కూడా ఆయ‌న కామ్రేడ్ల‌కు బ‌ద్ద శ‌త్రువు అయిన బీజపీలో చేర‌డంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు క‌ష్ట‌మే అనిపిస్తోంది.

Telugu Bjp, Cpi Cpm, Etala Rajender, Huzurabad, Revanth Reddy, Trs, Ts Potics-Te

ఇక‌పోతే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తే త‌మ‌కు ఏమైనా ఇబ్బందులు వ‌స్తాయోమే అనే అనుమానంలోఉన్నారు కామ్రేడ్లు.ఇక సీపీఎం త్వ‌ర‌లోనే త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని చెబుతున్నా ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.క‌నీసం పోటీ చేస్తామ‌ని కూడా చెప్ప‌లేదు.ఇక‌పోతే సీపీఐ మాత్రం కేంద్ర నాయ‌క‌త్వ నిర్ణ‌యం మేర‌కు ప‌నిచేస్తామంటున్నారు.కానీ ఇంకా స్న‌ప‌ష్ట‌మైన నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు.దీంతో ఆ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు అయోమయంలో ప‌డ్డారు.

ఇక మొన్న రేవంత్‌తో స‌భ పెట్టిన వీరు కాంగ్రెస్‌కు స‌పోర్టు ఇస్తారనే ప్ర‌చారం కూడా న‌డుస్తోంది.చూడాలి మ‌రి ఎవ‌రిక మ‌ద్ద‌తు ఇస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube