ఆనంద్ మహింద్రకి టైమ్ మెషీన్ తో పని ఏంటో..?!

ఆనంద్ మహీంద్రా.ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.

 What Is The Use Of Time Machine For Anand Mahindra , Room In The Taj, Mumbai, Rs-TeluguStop.com

మహీంద్రా గ్రూప్‌ చైర్మన్ గా మన అందరికి ఆనంద్ మహీంద్రా సుపరిచుతుడే.నిత్యం సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను పలకరిస్తూనే ఉంటాడు.

అలాగే ఎదో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిని ఆలోచింప చేస్తాడు.తాజాగా మరొక ట్వీట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు ఆనంద్ మహీంద్రా.

మీకు టైమ్ మిషన్ గురించి తెలుసా.అదే అండి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమాలో ఉంటుంది చూడండి అదే టైమ్ మెషీన్ అంటే.దీని వలన ఉపయోగం ఏంటంటే.ఈ మెషిన్ ద్వారా గడిచిన కాలంలోకి మనుషులు వెళ్లి తిరిగి వర్తమానంలోకి రావచ్చు అన్నమాట.

ఇప్పుడు అలాంటి టైమ్ మెషిన్ మన ఆనంద్ మహీంద్రాకి కావాలంట.సినిమాల్లో అయితే దానిని తీసుకురావడం సాధ్యం అవుతుంది కానీ.

నిజ జీవితంలో అలాంటి టైమ్ మెషిన్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి.అసలు ఆనంద్ మహీంద్రాకి టైమ్ మెషీన్ తో పని ఏంటి అనుకుంటున్నారా.?! దానికి ఒక కారణం ఉంది అండి.ఆయన తన ట్విట్టర్ లో తాజాగా టైం మిషన్‌ ఉంటే బాగుండు దానిని ఉపయోగించి వెంటనే గడిచిపోయిన కాలానికి వెళ్లాలని ఉందని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

అసలు అలా అనడానికి గల కారణం ఏంటంటే.ఆయన ఆ మెసేజ్ తో పాటు 1903 వ సంవత్సరంలో ముంబై లోని తాజ్‌ హోటల్‌ చిత్రాన్ని షేర్ చేసారు.ముంబై లోని తాజ్ హోటల్ కి ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే అప్పట్లో తాజ్‌ హోటల్ లో ఒక్కరోజు గడపాలంటే అక్కడ చెల్లించాలిసింది కేవలం 6 రూపాయలు మాత్రమే అని ఉన్న తాజ్‌ హోటల్‌ ఓపెనింగ్‌ బ్రోచర్‌ ను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ లో షేర్‌ చేశారు.

కానీ ఇప్పుడు అదే తాజ్ హోటల్ లో ఒక్కరోజు ఉండాలంటే 15 వేల నుంచి 18 వేల రూపాయిల వరకు చెల్లించాల్సి వస్తుంది.అందుకే ప్రస్తుత కాలం నుంచి గడిచిన కాలానికి అంటే 1903 సంవత్సరంలోకి వెళ్ళి ఒక రోజు గడపడానికి ఒక టైం మిషన్ కావాలని కోరుకుంటున్నారు ఆనంద్ మహీంద్రా.

చూసారా ఆ కాలానికి ఈ కాలానికి మధ్య ద్రవ్యోల్భణం రేటు ఎంత పెరిగి పోయిందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube