ఎమ్మెల్సీ ల ఎంపిక వెనుక ట్విస్ట్ ఏంటి ? మంత్రులు కాబోతున్న వారెవరు ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా, దానికి ఒక లెక్క ఉంటుంది.ఎవరికి అకస్మాత్తుగా ప్రాధాన్యం కల్పిస్తారు.

 What Is The Twist Behind The Selection Of Mlcs Who Are The Ministers Mlc Electio-TeluguStop.com

అకస్మాత్తుగా పాతాళానికి తొక్కేస్తారో  తెలియదు.కానీ అంతిమంగా టిఆర్ఎస్ కు మేలు జరిగే విధంగా కెసిఆర్ నిర్ణయాలు ఉంటాయి.

చాలా కాలంగా కెసిఆర్ తను మంత్రిమండలి విస్తరించాలని చూస్తున్నారు .అయితే వారిలో సమర్థులైన వారిని మాత్రమే ఉంచి మిగతా వారిని తప్పించాలని చూస్తున్నారు .దీనిలో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి వారి అందరికీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మొన్నటి వరకు కలెక్టర్ గా కొనసాగిన ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి ఆకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
    వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు .మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించబోతున్నట్లు టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతుంది.అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను కెసిఆర్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.ఈటెల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం,  ముదిరాజ్ వర్గీయులు అందర్నీ టిఆర్ఎస్ వైపుకు తీసుకు రాగలరు అనే అంచనాతో బండ ప్రకాష్ కు కేసీఆర్ క్యాబినెట్ లో అవకాశం కల్పించి , ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక పూర్తిగా పక్కన పెట్టారని ప్రచారం జరిగిన కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
   

Telugu Mlc, Telangana, Telangana Cm-Telugu Political News

ఆయనకు మండలి చైర్మన్ గా అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం  ఎంపికైన ఆరుగురిలో దాదాపు ముగ్గురు, నలుగురికి మంత్రుల ప్రమాణం రాబోతున్నట్లు సమాచారం.అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులను తొలగిస్తారని , వారి వల్ల టిఆర్ఎస్ కు కలిసి వచ్చింది ఏమీ లేదనే అభిప్రాయం లో ఉన్నారట.

ప్రస్తుతం ఎమ్మెల్యే ల కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలు కాకుండా,  త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లు 12  టిఆర్ఎస్ ఖాతాలోనే పడబోతున్నాయి.కడియం శ్రీహరికి      ఎవరెవరికి ఎమ్మెల్సీలు అవకాశం ఇస్తారు ? వీరు లో ఎంత మంది మంత్రులు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఎంపిక చేసిన,  ఎంపిక అవుతున్న ఎమ్మెల్సీల లో ఎక్కువ మంది మంత్రులుగా అవకాశం కల్పించే ఉద్దేశంతో వారికి కెసిఆర్ అవకాశం కల్పించినట్లు గా అర్థమవుతుంది.ఏదేమైనా టిఆర్ఎస్ లో భారీ ప్రక్షాళన చేపట్టి రాబోయే ఎన్నికల్లోనూ తమకు ఇబ్బంది లేకుండా చేసుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారట.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube