త్రివిక్రమ్‌ మనసులో ఏం ఉందో అర్థం కావడం లేదే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించాలనేది యంగ్‌ హీరోల డ్రీమ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక సీనియర్‌ హీరోలు మరియు స్టార్‌ హీరోలు అంతా కూడా ఈయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దంగా ఉంటారు.

 What Is The Trivikram Srinivas Next Movie  Trivikram Srinivas, Ntr, Rrr, Ram, Mo-TeluguStop.com

ఈ ఏడాది అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్‌ ఇండస్ట్రీ హిట్‌ను అల్లు అర్జున్‌కు ఇచ్చిన త్రివిక్రమ్‌ తదుపరి సినిమాను ఎన్టీఆర్‌ తో చేయాలని భావించాడు.ఇప్పటికే సినిమాను అధికారికంగా ప్రకటించారు.

కాని ఇప్పటి వరకు ఆ సినిమాను పట్టాలెక్కించలేదు.అందుకు కారణం కరోనా.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాని కారణంగా మరో ఆరు నెలల వరకు త్రివిక్రమ్‌ కు ఎన్టీఆర్‌ డేట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన తాను రెండేళ్ల పాటు గ్యాప్‌ తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అని భావిస్తున్న త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌తో సినిమా కంటే ముందు రామ్‌ తో ఒక సినిమాను త్రివిక్రమ్‌ చేయాలని భావిస్తున్నాడు అంటూ గత రెండు మూడు రోజులుగా వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.ఈ సమయంలోనే అఖిల్‌ అక్కినేనితో ఒక సినిమాను తీసేందుకు త్రివిక్రమ్‌ సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌ మరియు అఖిల్‌ల మద్య కథ చర్చ కూడా జరిగిందట. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.

ఆ తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ సినిమా చేయాల్సి ఉందని వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు అఖిల్‌ త్రివిక్రమ్‌ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి.ఇంతకు త్రివిక్రమ్‌ మనసులో ఎవరు ఉన్నారు అనేది మాత్రం అధికారికంగా క్లారిటీ రావడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube