అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి ఏంటీ?  

What Is The Switchwation Of Real Estate In Amaravathi-ap Cm Jagan Mohan Reddy,jagan Take The Three Capital Issue

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ రాజధాని పనులు కూడా ప్రారంభించడం జరిగింది.దాంతో రాజధాని ప్రకటనకు ముందు లక్షల్లో ఉన్న రేట్లు ఒక్కసారిగా కోట్లల్లోకి వెళ్లాయి.

What Is The Switchwation Of Real Estate In Amaravathi-Ap Cm Jagan Mohan Reddy Take Three Capital Issue

కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.సింగిల్‌ ఎకరం భూమి ఉన్న రైతు కూడా కోటీశ్వరుడు అయ్యాడు అంటే అతిశయోక్తి కాదు.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయ్యింది.అమరావతి రాజధాని కాదని మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్లుగా జగన్‌ ప్రభుత్వం ప్రతిపాధన తీసుకు రావడంతో పాటు అసెంబ్లీలో ఈ విషయమై బిల్లును కూడా తీసుకు వచ్చింది.

మండలిలో ఈ బిల్లు ఆగిపోయినా జగన్‌ ఏదోలా మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు.దీంతో అమరావతిలో భూముల రేట్లు పాతాలానికి పడిపోయాయి.అత్యంత దారుణమైన రేట్లు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి.గతంలో కోటి రూపాయలు పలికిన భూమి ఇప్పుడు కనీసం అయిదు పది లక్షలకు కూడా అమ్ముడు పోవడం లేదు.

అసలు అక్కడ భూములు అమ్మకాలు మరియు కొనుగోల్లు పూర్తిగా నిలిచి పోయాయి.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదాయం కూడా తగ్గిపోయింది.

తాజా వార్తలు

What Is The Switchwation Of Real Estate In Amaravathi-ap Cm Jagan Mohan Reddy,jagan Take The Three Capital Issue Related....