ఏపీకి కొత్త సీఎం ఈ కథనాల వెనుక కథ ఏంటి ?  

What is the story behind these articles by the new CM for AP - Telugu Ap, Bochha Satyanarayana, Chandrababu, Jagan, Peddireddi Ramachandrareddi, Tdp, Ysrcp

గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి.ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ఆ పదవిలో ఎంతోకాలం ఉండరని, త్వరలోనే ఏపీ కొత్త సీఎం రాబోతున్నారు అంటూ టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం హోరెత్తుతోంది.

TeluguStop.com - What Is The Story Behind These Articles By The New Cm For Ap

ఇంత ఆకస్మాత్తుగా ఈ ప్రచారం ఊపందుకోవదనానికి కారణాలు లేకపోలేదు.కొద్ది రోజుల క్రితం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ రమణ పై అనేక ఆరోపణలు చేస్తూ, ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.

అసలు జగన్ ఈ విధంగా లేఖ రాయడం ఒక రకంగా పెద్ద సంచలనమే.ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలతో పెట్టుకునేందుకు ఎవరు సాహసించరు.

TeluguStop.com - ఏపీకి కొత్త సీఎం ఈ కథనాల వెనుక కథ ఏంటి -Political-Telugu Tollywood Photo Image

అలా సాహసం చేస్తే, ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియంది కాదు.

అందుకే వీలైనంత దూరంగా ఉంటారు.

కానీ జగన్ మాత్రం ఆ సాహసానికి ఒడిగట్టారు.దీన్ని టిడిపి, ఆ పార్టీకి అనుకూల మీడియా తమకు అనుకూలంగా మార్చుకుని, అదేపనిగా జగన్ మాజీ సీఎం కాబోతున్నారు అంటూ ప్రచారం మొదలుపెట్టింది.

ఇక వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇదే విషయంపై పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.జగన్ సీఎం కుర్చీ నుంచి దిగిపోతే, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని చెబుతున్నారు.

అంతేకాకుండా ప్రస్తుత వైసీపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటివారు సీఎం రేసులో ఉన్నారు అంటూ అప్పుడే ప్రచారం మొదలు పెట్టేసారు.

ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ టీడీపీ అనుకూల మీడియా అప్పుడే ప్రచారం చేస్తోంది.వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి అని, జగన్ తీరుపై ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని, ఇలా గట్టిగానే హడావుడి మొదలు పెట్టేశారు.ఏపీలో ఏదో జరగరానిది జరిగిపోతుంది అనే చర్చను లేవదీశారు.

రాజ్యాంగ వ్యవస్థలతో జగన్ ఆటలు ఆడుకుంటున్నారని, అసలు ఇంతటి సాహసం జగన్ చేయడం ఆశ్చర్యం అంటూ పదేపదే కథనాలను వండి వార్చుతున్నాయి.జగన్ అనవసరంగా కోర్టులతో పెట్టుకుని పెద్ద తప్పు చేశారని, ఫలితం అనుభవిస్తారు అంటూ శాపనార్థాలు సైతం పెట్టేస్తున్నారు.

అసలు ఈ తరహా ప్రచారం ఊపందుకోవడం వెనుక చాలా తతంగమే ఉంది.ఈ ప్రచారం చేయడం ద్వారా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు వెనుకడుగు వేస్తున్నారని, కొంత కాలం వేచి చూస్తే మంచిదని ధోరణితో ఉంటారని, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు అని ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటోంది.

అందుకే ఈ తరహా ప్రచారానికి మరింత మసాలా జోడిస్తూ హడావుడి చేస్తోంది.

#Chandrababu #Jagan #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Is The Story Behind These Articles By The New Cm For Ap Related Telugu News,Photos/Pics,Images..