వినాయకుడి ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్దశి రోజు వినాయక చవితి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.ముఖ్యంగా యువత ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం మనం చూస్తున్నాము.

 Lord Ganesha, Ganesh Visarjan,ganesh, Water,hindhu,vinayaka Nimajjanam-TeluguStop.com

ఇలా వినాయక చవితి రోజు వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఆ ప్రతిమలను మూడు రోజులకు లేదా ఐదు రోజులకు లేదా తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయడం మనం చూస్తున్నాము.అయితే ఈ విధంగా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

ప్రతి ఏడాది వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది.ఈ క్రమంలోనే వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే చెరువుల నుంచి పూడిక తీసి వినాయకుడి ప్రతిమలను తయారు చేస్తారు.ఈ విధంగా మట్టితో తయారుచేసిన వినాయకుడుని వివిధ పత్రాలతో పూజ చేసిన అనంతరం నిమజ్జనం చేస్తారు.

ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు తొలగిపోయి నీరు శుద్ధి చేయబడతాయి.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి నీటిని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు.

అందుకోసమే మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.ప్రస్తుత కాలంలోఎన్నో రసాయనాలను ఉపయోగించి వినాయకుడి విగ్రహాలను తయారు చేయటం వల్ల వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తరువాత నీరు పెద్ద మొత్తంలో కలుషితమై ఎన్నో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది.

Telugu Ganesh, Ganesh Visarjan, Indhu, Lord Ganesha-Telugu Bhakthi

వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక కూడా మరో కారణం ఉంది.మట్టితో చేసిన విగ్రహాలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుందని, తొమ్మిది రోజుల తర్వాత మట్టి విగ్రహాలను పూజించినప్పటికీ అందులో ఏ విధమైనటువంటి దైవ శక్తులు ఉండవని, అందుకోసమే తొమ్మిదవ రోజు ఈ విధమైనటువంటి వినాయకుడి ప్రతిమలను నిమజ్జన చేస్తారని చెప్పవచ్చు.కేవలం వినాయకుడి ప్రతిమలు మాత్రమే కాకుండా దేవీనవరాత్రుల సమయంలో అమ్మవారి విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తికాగానే నిమజ్జనం చేయడం మనం చూస్తున్నాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube