స్పెషల్‌ : శివరాత్రి నేపథ్యం, విశిష్టత, పూజా విధానం  

What Is The Specialty Of Maha Shivaratri And How To Do Pooja This Day -

హిందువులు పరమ పవిత్రంగా ఆరాధించే శివయ్యకు ప్రీతి పాత్రమైన మహా శివరాత్రి నేడు.ఈ సందర్బంగా శివాలయాలతో పాటు అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి.

What Is The Specialty Of Maha Shivaratri And How To Do Pooja This Day - -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

శివ మాలలు ధరించిన వారు ఇన్ని రోజులు దీక్షలు చేసి నేడు శివుడి వద్ద మాల విరమించడం జరుగుతుంది.మహా శివరాత్రిని శివరాత్రి అని, శైవరాతిరి, శైవవరాత్రి, సివరాత్రి అని కూడా వివిధ ప్రాంతాల్లో పలుకుతూ ఉంటారు.

శివుడి యొక్క మహారాత్రి కనుక శివరాత్రి అంటారు.నేడు శివ, శక్తి కలయిక జరిగింది కనుక ఇది శివ రాత్రి అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి.

నేడు శివుడు, పార్వతిల వివాహం జరిగిన రోజు కావడం వల్ల శివుడికి ప్రీతిపాత్రమైన రోజు.అందుకే నేడు శివరాత్రి అని పండుగ జరుపుకుంటారు.నేడు శివయ్యకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోర్కెలు తీర్చుతాడని హిందువుల నమ్మకం.శివయ్య, పార్వతి దేవిల వివాహ మహోత్సవం సందర్బంగా జరుపుకునే వేడుకను శివరాత్రిగా నిర్వహించుకుంటారు కనుక ఈ రోజున భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడంతో పాటు ఉపవాసాలు, జాగారాలు చేస్తారు.

ఇక శివరాత్రి రోజున స్థాయికి తగ్గట్లుగా శివారాధన చేయాలి.గుడిలో అర్చన చేయించకున్నా కనీసం ఇంట్లో శివ ప్రతిమను పెట్టి పూజ చేసుకోవాలి.స్థాయికి తగ్గట్లుగా పండ్లు ఫలాలు ప్రసాదాలను శివుడికి ప్రసాదంగా పెట్టుకోవాలి.ఇక శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని పాలు మరియు పండ్లు మాత్రమే తీసుకుంటూ రాత్రి వరకు ఉపవాసం చేయాలి.

ఆ తర్వాత తెల్ల వారు జామున అయిదు గంటల వరకు జాగారం చేస్తూ ఉండాలి.జాగారం సమయంలో శివ నామస్మరణ చేయాలని పెద్దు అంటున్నారు.

కొందరు శివ నామస్మరణ కాకుండా సినిమాలకు వెళ్లడం, ఇంకేదో చేయడం చేస్తారు.కాని శివాలయ్యాల్లో జరిగే భజన కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదని చెబుతున్నారు.మొత్తానికి కోరిన కోర్కెలు తీర్చే శివయ్యను బోలా శంకరుడు అంటారు.అందుకే ఆయన్ను మెప్పించాలంటే శివరాత్రి రోజు సిన్సియర్‌గా పూజా ఉపవాసం ఇంకా జాగారం చేయాలని హిందు మత బోధకులు చెబుతున్నారు.

What Is The Specialty Of Maha Shivaratri And How To Do Pooja This Day- What Is The Specialty Of Maha Shivaratri And How To Do Pooja This Day-- Telugu Related Details Posts....

BREAKING/FEATURED NEWS SLIDE