శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారంలోను,సంప్రదాయంలోనూ ఎన్నో ఆరోగ్యపరమైన లాభాలు దాగి ఉన్నాయి.శ్రీరామనవమి కి వడపప్పు – పానకం నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఎందుకు తీసుకుంటారో తెలుసా? అసలు మన పెద్దలు పెట్టిన ప్రసాదాలు అన్ని ఆయా ఋతువులను దృష్టిలో పెట్టుకొని మన శరీర ఆరోగ్యాన్ని బట్టి కూడా నిర్ణయించారు.వడపప్పు – పానకం అనేవి కూడా ఆలా అలోచించి నిర్ణయించినవే.

 What Is The Speciality Of Sri Rama Navami Prasadam-TeluguStop.com

ఈ ఋతువుల్లో వచ్చే గొంతు సంబంధ వ్యాధులకు పానకంలో వేసే మిరియాలు,యాలకులు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

మంచి ఔషధంగా పనిచేస్తాయి.అంతేకాకుండా పానకం విష్ణు మూర్తికి ప్రియమైనది.

ఈ ఋతువులో శరీరంలో వేడి కూడా పెరుగుతుంది.ఆ వేడి తగ్గించటానికి పెసరపప్పు సహాయాపడుతుంది.

పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది.జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది.దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక.పెసరపప్పును ‘వడ’పప్పు అని కూడా అంటారు.

అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతికరమైనది.

అందువల్ల ఒక్క శ్రీరామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube