సంక్రాంతి స్పెషల్‌ : భోగి మంటల్లో ఏం వేస్తారు, ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి అతి పెద్ద పండుగ అనే విషయం తెల్సిందే.ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ కోసం రెండు మూడు నెలల ముందు నుండే ఎదురు చూస్తూ ప్రి పేర్‌ అవుతూ ఉంటారు.

 What Is The Special Of Sankranti Bhogi Festival-TeluguStop.com

హైదరాబాద్‌లో ఉండే దూర ప్రాంతాల వారు అంతా కూడా పండుగకు వెళ్తారు.అలా సంక్రాంతి సందర్బంగా హైదరాబాద్‌ దాదాపుగా 75 శాతం ఖాళీ అవుతుంది.

అంతగా ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల వారు జరుపుకుంటున్నారు.ఇక నేడు సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి.

ఈ సందర్బంగా తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు.ఆ భోగి మంటల వద్ద పిల్లల ఆటలు చూడవచ్చు.

Telugu Bhogisankranthi, Bhogifruts, Sankranti Bhogi, Telugufestival, Sankrantibh

భోగి మంటలు అనేవి చాలా మంది వేస్తారు.కాని అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనే విషయాన్ని మాత్రం కొంత మంది మాత్రమే గుర్తిస్తారు.అసలు విషయం ఏంటీ అంటే భోగి మంటల్లో పాత వస్తువులు వేస్తే మంచి జరుగుతుంది అంటారు.మనసులోని చెడును, పాత బాధ పెట్టే జ్ఞాపకాలను తొలగిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేందుకోసం ఈ భోగి మంటలు వేస్తారంటూ పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇక పిల్లలకు తెల్లవారు జామున బయట ప్రపంచం చూపించడంతో పాటు వారికి పండుగ యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు కూడా ఈ భోగి మంటలు వేస్తారట.

Telugu Bhogisankranthi, Bhogifruts, Sankranti Bhogi, Telugufestival, Sankrantibh

భోగి రోజు మంటలు వేయడంతో పాటు భోగి పండ్లు కూడా పోస్తారు.అంటే భోగి పండ్లు అంటే రేగు పండ్లు.పండు కచ్చ కలయికలో భోగి పండ్లను నేడు పిల్లలకు పోస్తారు.

అలా పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా అవ్వడంతో పాటు వారికి ఉన్న చెడు దృష్టి అంతా పోతుందని కూడా పెద్దలు అంటూ ఉంటారు.మొత్తానికి భోగి పండుగ నుండి మొదలుకుని కనుమ వరకు మూడు రోజులు వరుసగా తెలుగు రాష్ట్రాల ప్రజలు బిజీ బిజీగా పండుగ జరుపుకుంటూనే ఉంటారు.

మరి మీ పండుగ సెలబ్రేషన్స్‌ మొదలు అయ్యాయా మాకు తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube