బీజేపీ 'కన్నా ' బెటర్ ఆప్షన్ లేదా ? ఆ  పదవి వచ్చేనా ? 

ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఆయన బీజేపీలో ఉన్నా,  పెద్దగా యక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.

 What Is The Situation Of Kanna Lakshmi Narayana In Bjp Now Will He Get Rajyasabh-TeluguStop.com

గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కన్నా తన హవాను చూపించారు.ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు.

వైసీపీ ప్రభుత్వం పైన అదేపనిగా విమర్శలు చేస్తూ హడావుడి చేసే వారు.  ఇక అమరావతి రాజధాని విషయంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రవర్తించే వారు.

  అయితే కేంద్రంలో బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం అవుతూ ఉండడం , జగన్ ను దూరం చేసుకోలేని పరిస్థితి ఏర్పడడంతో బీజేపీ అధిష్టానం పెద్దలు కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజు కు ఆ పదవిని కట్టబెట్టారు.

ఇక అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్నారు.

గతంలో ఉన్నంత చురుకుదనం ఆయనలో కనిపించడం లేదు.ఏపీ బీజేపీలోను వర్గాలు ఉండడంతో సోము వ్యతిరేక వర్గం లోనే కన్నా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తాను మళ్లీ పోటీ చేసి పునర్వైభవం సంపాదించాలనే ఆసక్తితో ఉన్నారు.అయితే ప్రస్తుతం కన్నా మౌనంగా ఉండడం ఆయన అనుచరులు సైతం అంతు పట్టడం లేదు.

గత కొద్ది రోజులుగా కన్నా లక్ష్మీనారాయణ కు రాజ్యసభ సభ్యత్వం దక్కబోతోంది అనే హడావుడి మొదలైంది.ఖచ్చితంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సముఖంగా ఉన్నట్లుగా ప్రచారం తెరపైకి వచ్చింది.
  ఒకవేళ రాజ్యసభ సభ్యత్వం దక్కకపోతే పరిస్థితి ఏమిటనేది అంతుపట్టడం లేదు.

Telugu Ap Bjp, Ap, Jagan, Kannalakshmi, Somu Veerraju, Ysrcp-Political

కానీ లక్ష్మీనారాయణ మాత్రం 2019 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి తో ఉన్నారట.గతంలో నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అనుభవం ఉండడంతో , ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు సాధ్యం అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట ఒకవేళ అది కుదరని పక్షంలో నరసరావుపేట , సత్తెనపల్లి లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికిప్పుడు యాక్టివ్ కావడం కన్నా,  రాజ్యసభ సభ్యత్వం విషయంలో ఏదో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్పందిస్తే  మంచిదనే అభిప్రాయం తో ఉన్నారట.

ఒక దశలో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగినా,  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపి ని మించిన బెటర్ ఆప్షన్ లేదనే అభిప్రాయం కూడా కన్నా ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube