బలవంతుడైన మహిషాసురుడు స్త్రీ చేతిలో చనిపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

మన పురాణాల ప్రకారం ఆదిశక్తి మహిషాసుర అనే రాక్షసుని వరించడం చేత ఆమెకు మహిషాసురమర్దిని అనే పేరు చేత పూజిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.ఎంతో శక్తిశాలి అయిన మహిషాశురుడు ఆడవారి చేతిలో చనిపోవడానికి గల కారణం ఏమిటి అదే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

 What Is The Secret Behind Mahishudus Death-TeluguStop.com

పురాణాల ప్రకారం దనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేశారు.కరంభుడు నీటిలో పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సును కొనసాగించారు.

ఈ క్రమంలోనే కరంభుడిని ఇంద్రుడు నీటిలో నుంచి ఒక ముసలి రూపంలో వచ్చి కరంభుడుని సంహరించాడు.ఈ విధంగా తన సోదరుడు మృతి చెందడంతో ఆగ్రహం చెందిన రంభుడు తాను కూడా తన తల నరుక్కొని ఆ బోలా శంకరుడుకి అర్పించాలని సిద్ధమయ్యాడు.

 What Is The Secret Behind Mahishudus Death-బలవంతుడైన మహిషాసురుడు స్త్రీ చేతిలో చనిపోవడానికి కారణం ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తన తలను నరకబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెబుతారు.

Telugu Adishkathi, Death, Indra, Mahishudus, Ram Bhudu, Woman-Telugu Bhakthi

ఈ క్రమంలోనే రంభుడు పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి.నాకు పుట్టే ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావలి అనే వరం కోరుకోగా అందుకు పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు.ఈ క్రమంలోనే పరమేశ్వరుని దగ్గర వరం పొంది ఇంటికి వెళ్తున్న రాముడు మార్గమధ్యంలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు.

అప్పుడు రుద్రుడు తన అంశంతో మహిషిని గర్భంలోకి ప్రవేశించి మహిషాకారంతో బిడ్డ జన్మించాడు.అతడే మహిషాసురుడు.

ఈ విధంగా పుట్టిన మహిషాసురుడు ఎంతో బలశాలి.ఏకంగా ఇంద్రుడిని చేయించి ముల్లోకాలను ఏలుతూ అందరిని గజగజలాడిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షిశిష్యుని బాధిస్తూ వుండడంతో కోపోద్రిక్తుడైన మహర్షి మహిషాసురుడికి స్త్రీ చేతిలోనే నీకు మరణం సంభవిస్తుందని శపించాడు.ఈ విధంగా మహర్షి శాపం పొందినప్పటికీ అతనిలో ఏ మాత్రం మార్పు లేకుండా సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు.

అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించడంతో ఆమె ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది.

#Indra #Mahishudus #Death #Woman #Ram Bhudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU