తలస్నానం ఏ పూట చేయాలి ?  

What Is The Right Time To Take A Head Bath ?-

తలస్నానం ఎందుకు చేస్తాం ? జుట్టుని శుభ్రం చేసుకోవాడానికి, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికె కదా.మరి ఇలా తలస్నానం చేసి అలా ఎండలోకి వెళితే లాభం ఏముంది ? కాని చాలామందికి ఉదయం పూట తలస్నానం చేయడమే అలవాటు.కొందరు పూజల కోసం, ఉపవాసం కోసం, ఇతర భక్తిప్రధాన కారణాల కోసం ఉదయం పూట తలస్నానం చేస్తారు..

What Is The Right Time To Take A Head Bath ?---

ఉదయం తలస్నానం చేయడం తప్పు కాదు.కాని ఉదయం తలస్నానం చేసేకన్నా, రాత్రి తలస్నానం చేస్తేనే బెటర్.ఎలా అంటారా ?* ఉదయంపూట మనకి చాలా పనులు ఉంటాయి.

బడికో, గుడికో, ఆఫీసుకో, ఇంకేదైనా పనికో, ఉదయం త్వరత్వరగా స్నానం చేసి, త్వరగా పనికి చేరాలనుకుంటాం.కాబట్టి ఆదరాబాదరాగా స్నానం కానిచ్చేస్తాం.అంటే స్నానం మీద పెద్దగ శ్రద్ధ పెట్టడం లేదన్నమాట.

అదే రాత్రి తలస్నానం చేసారనుకోండి, కావాల్సినంత సమయం దొరుకుతుంది.మనసు పెట్టి స్నానం చేయవచ్చు.* రాత్రి తలస్నానం చేసి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి.

తలస్నానం చేస్తే బాడి టెంపరేచర్ తగ్గుతుంది.దాంతో నిద్ర సుఖంగా పడుతుంది.* ఉదయం తలస్నానం చేసి బయట దుమ్ముధూళికి మన జుట్టుని ఎక్స్పోజ్ చేస్తాం.

దీంతో జుట్టు వెంటనే డ్రై అయిపోతుంది.తలస్నానం చేసిన లాభం కొద్దిసేపే.కాని రాత్రి అలా కాదుగా.

* తలస్నానం ఇలా చేయగానే అలా మనకు ఇష్టమైన రీతిలో తల దువ్వుకోవడం కష్టమవుతుంది.జుట్టు పచ్చిగా ఉంటే అంతేగా మరి.కాని రాత్రి తలస్నానం చేసి పడుకుంటే, ఉదయం మనకు కావాల్సిన రీతిలో హెయిర్ స్టయిల్ ని మార్చుకోవచ్చు.

* ఉదయాన్నే లేచి చలిలో తలస్నానం చేసే బదులు, రాత్రిపూట టెంపరేచర్ చూసుకొని తలస్నానం చేయడం బెటర్.దీంతో జలుబు లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది.* వీటికి మించి చెప్పాలంటే, రాత్రిపూట హాయి నిద్రకి తలస్నానానికి మించిన మార్గం లేదు.

ప్రశాంతమైన మనసు మంచి నిద్రనిస్తుంది.మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.