అలీతో సరదాగా షోకు వచ్చే గెస్ట్ లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతంటే?

కమెడియన్ అలీ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.భాష తెలియని వారు కూడా అలీ కామెడీని ఆస్వాదిస్తారంటే కమెడియన్ గా అలీ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాడో మనం అర్ధం చేసుకోవచ్చు.

 What Is The Remuneration Given To The Guests Who Come To The Show For Fun With A-TeluguStop.com

ఇక బాలనటుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అలీ ఎంతో కష్టపడి, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరితో కలివిడిగా ఉంటూ 500 కు పైగా సినిమాల్లో నటించాడు.అయితే కమెడియన్ గా, హీరోగా వెండి తెర మీద అలరించిన అలీ బుల్లి తెర మీద యాంకర్ గా కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.

అయితే ప్రస్తుతం అలీ చేస్తున్న షో అలీతో సరదాగాఈ షో కు వెండి తెర నటులు గెస్ట్ లుగా వస్తుంటారు.వారి వ్యక్తిగత జీవితాన్ని, సినిమా జీవితాన్ని వారు ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టాల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.

అందుకే ఈ షో ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది.అయితే ఈ షో గురించి అందరిలో ఉండే ఒక అనుమానం వచ్చే గెస్ట్ లకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు అని.కాని ఈ విషయంపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అలీ తో సరదాగా షో కు వచ్చే గెస్ట్ లకు ఎపిసోడ్ కు లక్ష రూపాయలు ఇస్తారని తెలుస్తోంది.

ఈ షో కు వచ్చే గెస్ట్ ల రవాణా సదుపాయాలు, హోటల్ నుండి అన్నీ ఈ షో వారే భరిస్తారట.అయితే సినిమా ప్రమోషన్ కోసం వచ్చే గెస్ట్ లకు ఎటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వరని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube