మురారి సినిమాకి.. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధం ఏంటి?

తెలుగు సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో మురారి సినిమా కచ్చితంగా ఉంటుంది.తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సినిమా ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

 What Is The Relation Between Murari Movie And Rajiv Gandhi Assassination, Murari-TeluguStop.com

మహేష్ బాబు, సోనాలీ బింద్రే హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.అయితే ఈ సినిమా కథ ఎక్కడి నుంచో పుట్టి మరెక్కడికో వెళ్లింది.

ఇంతకీ ఈ సినిమా కథ ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తమిళనాడు పర్యటనకు వెళ్లి.

అక్కడే హత్యకు గురయ్యారు దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ.ఆ హత్యలో నుంచి పుట్టిన స్టోరీనే మురారి.

ఈ సినిమా స్టోరీకి, ఆయన హత్యకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను.ఓ సారి దర్శకుడు కృష్ణవంశీ తన ఫ్రెండ్స్ తో కలిసి లాంచీ జర్నీ చేస్తున్నాడు.

ఈ సందర్భంగా వారి మధ్య రాజీవ్ గాంధీ మర్డర్ అంశం చర్చకు వచ్చింది.వారి కుటుంబంలో ఇప్పటికే చాలా మంది చనిపోయినట్లు చెప్పుకున్నారు.వారి కటుంబానికి శాపం ఉండటం మూలంగానే వరుస హత్యలు జరుగుతున్నాయని అనుకున్నారు.

Telugu Cured Story, Krishna Vamshi, Prime India, Mahesh Babu, Murari, Rajiv Gand

అప్పుడే దర్శకుడి మైండ్ లో ఓ కథ వెలుగు వెలిగింది.శాపంతో కూడిన కుటుంబంపై సినిమా తీయాలి అనుకున్నాడు.అదే మురారీ అయ్యింది.

మొత్తంగా ఈ సినిమా స్టోరీని రాశాడు కృష్ణవంశీ.మహేష్ బాబు హీరోగా ఈ సినిమా చేస్తే బాగుటుంది అనుకున్నాడు.వెంటనే ఈ స్టోరీని ఆయన తండ్రి కృష్ణకు చెప్పాలనుకున్నాడు.ఓ రోజు పద్మాలయ ఆఫీస్‌లో కృష్ణ, మహేశ్‌ బాబుకు కృష్ణ వంశీ ఆ కథను వివరించాడు.

Telugu Cured Story, Krishna Vamshi, Prime India, Mahesh Babu, Murari, Rajiv Gand

స్టోరీ వారికి బాగా నచ్చింది.భాగవతం, భారతంలోని క్యారెక్టర్లను ఈ సినిమా క్యారెక్టర్లుగా రూపొందించాడు కృష్ణ వంశీ .అనంతరం ఈ కథను సిరివెన్నెల సీతారామ శాస్త్రికి చూపించాడు.ఆయన కొన్ని మార్పలు చేశాడు.

ఫైనల్ స్క్రిప్ట్ ను కృష్ణకు చూపించాడు కృష్ణ వంశీ.ప్రొసీడ్ అని చెప్పాడు కృష్ణ.తక్కువ సమయంలోనే ఈ సినిమా పూర్తయ్యింది.2001, ఫిబ్రవరి 17న విడుదలైంది.ప్రిన్స్ సినిమా కెరీర్ లోనే స్పెషల్ మూవీ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube