జబర్దస్త్ కు దూరమైన హైపర్ ఆది కామెడీ స్టార్స్ కు రాకపోవడానికి కారణం అదేనా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటారు.గత కొన్ని సంవత్సరాల నుంచి హైపర్ ఆది తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 What- Is The Reason Hyper Aadi Is Not Coming To To The Comedy Stars For Away Fr-TeluguStop.com

ఇదే గుర్తింపుతో ఆది పలు సినిమాలలో కూడా నటించారు.అయితే ప్రస్తుతం ఈయన జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయ్యారు.

ఇలా ఆది దూరం కావడానికి గల కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియడం లేదు.అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరం అయిన వారందరూ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ప్రత్యక్షం అవుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ స్టార్ మా లో సందడి చేయగా హైపర్ ఆది కూడా జబర్దస్త్ నుంచి కామెడీ స్టార్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి సుమారు రెండు నెలలు పూర్తయిన ఇప్పటివరకు ఆయన ఇతర కార్యక్రమాలలో కనిపించడం లేదు.

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం హైపర్ ఆదికి స్టార్ మా వాళ్ళు ఆహ్వానం పలకలేదని తెలుస్తోంది.జబర్దస్త్ వీడిన వాళ్ళందరూ కామెడీ స్టార్స్ లోకి రావడం వల్ల కామెడీ స్టార్స్ కార్యక్రమం తిరిగి జబర్దస్త్ కార్యక్రమమే అవుతుందని స్టార్ మా భావించారట.

Telugu Stars, Hyper Aadi, Jabardast, Telugu, Tollywood-Movie

అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఒక్కో స్కిట్ కి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే హైపర్ ఆది స్టార్ మాకు రావడంతో ఆయనకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే స్టార్ మా అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వలేక తనని కామెడీ స్టార్ట్స్ కార్యక్రమానికి ఆహ్వానించలేదనే విషయం తెలుస్తోంది.ఇకపోతే హైపర్ ఆదికి సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ తాను మంచి భారీ హిట్ సినిమా అవకాశాన్ని అందుకుంటే భవిష్యత్తులో తనకు మరిన్ని మంచి సినిమా అవకాశాలు వస్తాయని లేదంటే తన భవిష్యత్తు పూర్తిగా ప్రమాదంలో పడుతుందని హైపర్ ఆది భావించడంతో ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలకు కమిట్ కాలేదని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube