శ్రీను వైట్ల వరుస డిజాస్టర్ లు తీయడానికి కారణం ఏంటి..?

డైరెక్టర్ సాగర్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసి ఆ తర్వాత ఈ వి వి సత్యనారాణ గారి దగ్గర దర్శకత్వ మెళుకువలు నేర్చుకున్న శ్రీనువైట్ల ఆ తర్వాత కాలం లోనే డైరెక్టర్ గా మారి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.శ్రీను వైట్ల మొదటి సినిమా గా వచ్చిన నీకోసం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయింది.

 What Is The Reason For Srinu White's Series Of Disasters ,srinu Vaitla ,kona Ven-TeluguStop.com

ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఈ సినిమాకి గాను శ్రీను వైట్ల కి నంది అవార్డు వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత తీసిన ఆనందం సినిమా మంచి విజయం సాధించి శ్రీను వైట్లకి కమర్షియల్ సక్సెస్ అందించింది…ఇక ఈ సినిమా తరువాత ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమా పెద్దగా ఆడలేదు ఈ సినిమాలో కామెడీ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

Telugu Aryan Rajesh, Bobby, Brucely, Chiranjeevi, Sagar, Gopi Mohan, Harish Shan

ఇక మూడవ సినిమా అయినా వెంకీ సినిమా కోసం రైటర్ కోన వెంకట్ ని రవి తేజ శ్రీను వైట్ల కి పరిచయం చేసాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇక దాంతో కోన వెంకట్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చాయి.వరుసగా ఢీ, దుబాయ్ శ్రీను, రెడీ, కింగ్, నమోవెంకటేశ, దూకుడు, బాద్షా లాంటి వరుస హిట్ సినిమాలు వచ్చాయి.

 What Is The Reason For Srinu White's Series Of Disasters ,Srinu Vaitla ,kona Ven-TeluguStop.com

బేసిగ్గా శ్రీను వైట్ల మూవీ అంటే రైటర్లు గా కోన వెంకట్, గోపిమోహన్ లు ఉంటారు అలా వాళ్ళు రాసిన కథ కి, డైలాగ్స్ కి శ్రీను వైట్ల కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని అన్నింటికీ తన పేరు వేయించుకోవడం తో కోన వెంకట్ కి శ్రీను వైట్ల కి మధ్య గొడవలు జరిగాయి.దాంతో కోన వెంకట్ శ్రీను వైట్ల కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేసాడు.

బ్రుస్లీ సినిమాతో చిరంజీవి వీళ్ళిద్దరిని కలిపినప్పటికీ వాళ్ల మధ్య ఉన్న మనస్పర్థలు మాత్రం తొలిగిపోలేదు అనేది ఆ సినిమా ని చూస్తే తెలుస్తుంది.

Telugu Aryan Rajesh, Bobby, Brucely, Chiranjeevi, Sagar, Gopi Mohan, Harish Shan

కోన వెంకట్ తన అసిస్టెంట్స్ అయినా బాబీ, హరీష్ శంకర్ సినిమాలకి వర్క్ చేసుకుంటూ మిగిలిన ఇంకా కొన్ని సినిమాలకి డైలాగ్స్ రాసుకుంటూ సినిమాల్లో బిజీ గా ఉంటున్నప్పటికీ, శ్రీను వైట్ల మాత్రం సినిమాలు లేక ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారు శ్రీను వైట్ల ని చూసిన సినీ పెద్దలు ఒకరి క్రెడిట్ ని మనం వాడుకొని వాళ్ళకి అన్యాయం చేస్తే మనకు కూడా ఏదో ఒక రోజు అన్యాయం జరుగుతుంది అని అనడానికి శ్రీను వైట్ల నే ఒక ఉదాహరణ అని అంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube