'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ కు చిన్న బ్రేక్‌.. కారణం ఇదేనా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్‌ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగించడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అవ్వడంతో గుమ్మడి కాయ కొట్టే వరకు మళ్లీ షూటింగ్ కు బ్రేక్ ఉండదని అనుకున్నారు.

 What Is The Reson For Rajamouli Rrr Movie Shooting Break , Film News, Ntr, Rajam-TeluguStop.com

కాని అనూహ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు వారం రోజుల బ్రేక్ తీసుకుంటున్నారు.షూటింగ్‌ స్పీడ్ గా జరుగుతుందని భావిస్తున్న సమయంలో బ్రేక్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఉన్నట్లుండి చిత్ర యూనిట్‌ సభ్యులు బ్రేక్‌ తీసుకోవడానికి కారణం ఏంటీ అంటూ చర్చ జరుగుతోంది.రాజమౌళి షూటింగ్ కు ఇన్ని నెలలు బ్రేక్ వచ్చింది.

అయినా కూడా మళ్లీ మొదలు పెట్టిన వెంటనే బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఏంటీ అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.మీడియా వర్గాల్లో జరుగుతున్న పుకార్లు షికార్లను బట్టి చూస్తే ఈ సినిమా షూటింగ్‌ కోసం ఒక కీలక నటుడు రావాల్సి ఉంది.

ఆయన ఇతర సినిమా తో బిజీగా ఉన్న కారణంగా షూటింగ్‌ ను వాయిదా వేయడం జరిగిందని కొందరు అంటున్నారు.

కొందరు మాత్రం సినిమా కోసం వేస్తున్న సెట్టింగ్ ఇటీవల వర్షం వల్ల నాశనం అయ్యింది.

దాన్ని మళ్లీ ఇండోర్‌ లో వేస్తున్నట్లుగా చెబుతున్నారు.ఆ సెట్‌ పూర్తి అయిన తర్వాత మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

మొత్తానికి రకరకాలుగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి.

Telugu Alia Bhatt, Damaged, Rajamouli, Ram Charan, Rrr, Rrr Break, Rumors, Tolly

సినిమా ను ఆగస్టు వరకు పూర్తి చేసి అక్టోబర్‌ లో సినిమా ను విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.మొత్తానికి రకరకాలుగా ఈ సినిమా గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరో వారం రోజుల తర్వాత ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కు మళ్లీ బ్రేక్ లేకుండా గుమ్మడి కాయ కొట్టే వరకు కంటిన్యూ చేస్తారని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube