బిగ్‌బాస్‌ : రాహుల్‌, శ్రీముఖిల మద్య గొడవ ఏమైంది?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మరో మూడు నాలుగు రోజుల్లో ముగియబోతుంది.ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు అంతా కూడా ఎవరు గెలుస్తారా అంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 What Is The Reason For Rahul And Srimukhifight-TeluguStop.com

రాహుల్‌ కు అనూహ్యంగా మద్దతు పెరిగింది.అదృష్టం కొద్ది మొదట్లోనే ఫినాలే వరకు వెళ్లాడు.

ప్రస్తుతం ఫైనల్‌లో శ్రీముఖి, రాహుల్‌, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీలు ఉన్నారు.శ్రీముఖి కార్నర్‌ చేయడం వల్ల రాహుల్‌కు చాలా సింపతీ గెయిన్‌ అయ్యింది.

రాహుల్‌ చాలా కామ్‌గా ఉన్నా కూడా శ్రీముఖి వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతున్న కారణంగా శ్రీముఖి యాంటీ ఫ్యాన్స్‌ అంతా కలిసి రాహుల్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

రాహుల్‌ కు శ్రీముఖితో గొడవ కలిసి వచ్చింది.

కాని ఇప్పుడు మళ్లీ శ్రీముఖితో రాహుల్‌ బాగానే ఉంటున్నాడు.వీరిద్దరు కూడా మళ్లీ క్లోజ్‌ అయ్యారు.

గొడవలు పక్కన పెట్టి రాహుల్‌తో శ్రీముఖి మింగిల్‌ అయ్యి కలిసి పోతుంది.ప్రస్తుతం వీరిద్దరి మద్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆట కొనసాగుతోంది.

ఇక శ్రీముఖితో రాహుల్‌ గొడవ కారణంగా చాలా మంది రాహుల్‌కు ఓట్లు వేస్తూ వచ్చారు.ఇప్పుడు రాహుల్‌, శ్రీముఖి కలిసి పోవడంతో వారు ఎటు ఓట్లు వేస్తారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Telugu Baba Baskar, Rahul Srimukhi, Rahul Sipligunj, Srimukhi, Varun Sandesh-

  పెద్ద ఎత్తున శ్రీముఖి మరియు రాహుల్‌లకు ఓట్లు వస్తున్న కారణంగా ఫైనల్‌ విన్నర్‌ ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఫైనల్‌ విన్నర్‌ విషయంలో మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది.రికార్డు స్థాయిలో ఈ వారం ఎపిసోడ్స్‌కు టీఆర్పీ రేటింగ్‌ వస్తుందని టాక్‌.ఎందుకంటే ఈ వారంలో అంతా కూడా సందడి ఉంటుంది.పాత కంటెస్టెంట్స్‌ మళ్లీ ఇంట్లోకి రావడం, వారు ఒక రోజంతా ఉండటం జరుగుతుంది.ఇక నిన్నటి ఎపిసోడ్‌లో సుమ వచ్చింది.

ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube