అక్కడ కాంగ్రెస్ ఎందుకు ఓడిందబ్బా ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతుంది అనే సమయంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ఆ పార్టీలు ఎక్కడలేని ఉత్సాహాన్ని తీసుకు వచ్చాయి.హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలిచి తీరుతామని ఆ పార్టీ నేతలు భావించారు.

 What Is The Reason Congress Loose In Huzurnagar Elections-TeluguStop.com

అయితే అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నీరుకారిపోయింది.

కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఈ విధంగా చేదు ఫలితాలు రావడానికి కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.గత ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ సీటును కాపాడుకోలేక పోవడానికి ఆ పార్టీలో అంతర్గత విభేదాలా లేక నాయకుల మధ్య సమన్వయ లోపమా అనే విషయాన్ని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విశ్లేషించుకుంటున్నారు.

Telugu Congress, Trsshanam, Uttamkumar, Congressloose-Telugu Political News

  త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు తప్పక ప్రభావం చూపిస్తాయని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడానికి కారణాలు ఒకసారి విశ్లేషిస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టే విషయంలోనే మొదటగా నాయకుల మధ్య సమన్వయలోపం గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి భార్య పద్మావతికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించగానే ఎంపీ రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు.పద్మావతికి టికెట్ ఇవ్వాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు అంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను ఆయన ప్రశ్నించారు.

అంతే కాదు స్థానికురాలైన శ్యామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆయన పట్టుబట్టారు.అయితే సీనియర్ నాయకులంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు నిలబడడంతో రేవంత్ మాట నెగ్గలేదు.

ఇక ఆ తర్వాత చేసేదిలేక పద్మావతి మద్దతుగా రేవంత్ నిలబడాల్సి వచ్చింది.

Telugu Congress, Trsshanam, Uttamkumar, Congressloose-Telugu Political News

  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పోలింగ్ తేదీ వరకు కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు స్పష్టంగా కనిపించాయి.ఆ పార్టీ నాయకులు ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికే సమయమంతా వెచ్చించారు తప్ప టిఆర్ఎస్ మీద విమర్శలు చేసి తమ పార్టీ విజయానికి బాటలు వేసుకోవడంలో కాంగ్రెస్ నాయకులంతా విఫలం అయ్యారు.అయితే ఇదే సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ వ్యతిరేకత తదితర విషయాలు ఇబ్బంది పెట్టినా ఆ ప్రభావం హుజూర్ నగర్ పై పడకుండా గ్రామానికి ఓ కీలక నాయకుడు కి బాధ్యతలు అప్పగించి టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube