రావణాసురుడికి పది తలలు ఎలా వచ్చాయో తెలుసా?

రావణాసురుడి పేరు వినగానే మనకు పది తలలతో ఉన్న ఓ రూపం మనసులో మెదులుతుంది.సీతను ఎత్తుకుపోయి… రాముడితో యుద్ధం చేసేటప్పుడు ఈ పది తలల రూపాన్ని బయటపెడతాడు రావణాసురుడు.

 What Is The Reason Behind Ravana Have 10 Heaads, Ravanasudu , Lord Rama , Sitade-TeluguStop.com

అయినప్పటికీ శ్రీరామ చంద్ర మూర్తి రావణాసురుడిని చంపి.సీతను తీసుకెళ్తాడు.

రాక్షసుల రాజు, లంకాధిపతి అయిన రావణాసురుడికి పది తలలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.అలా అని రావణుడుకి పుట్టుకతోనే ఆ పది తలలు వచ్చాయనుకుంటే పొరపాటే.

అలాగని ఎవరూ ఆయనకు పది తలలు ఉండాలని వరం కూడా ఇవ్వలేదు.రావణాసురుడు నేర్చుకున్న కామ రూప విద్య కారణంగానే ఆయనకు పది తలలు ఏర్పడ్డాయి.

ఈ పది తలలకు తోడుగా… 20 చేతులు కూడా వస్తాయి.ప్రతి రోజూ రావణాసురుడు ఒక మొహంతోనే కనిపించేవాడు.

కేవలం యుద్ధం చేసేటప్పుడే మాత్రమే ఈ పది తలల రూపాన్ని వాడుతుండేవాడని పురణాలు చెబుతున్నాయి.

Telugu Heads, Devotional, Lord Rama, Padi Thalalu, Ravana, Ravanasudu, Ravanasur

ఈ పది తలలు ఆధ్యాత్మికంగా ఒక సంకేతాన్ని కూడా సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అదేంటంటే… మనస్సుకు లోబడి ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయి.ఈ పది ఇంద్రియాలనూ అదుపులో పెట్టకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలమవుతుంది.

ఈ పది ఇంద్రియాలకు లొంగిపోయినవాడే రావణుసురుడట.అందుకే విపరీతమైన కామ వాంఛ కల్గి సీతమ్మను ఎత్తుకుపోయాడు.

 అందు వల్లే అపార శాస్త్ర పరిజ్ఞానం, వైద్య విజ్ఞానం, మంత్ర విద్య ఉన్నప్పటకీ… రాముడి చేతిలో మరణం పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube