అమ్మవార్ల పక్కనే కాపలాగా పోతరాజు ఎందుకుంటాడు?

WHAT IS THE REASON BEHIND POTHARAJU PROTECT GRAMA DEVATHALU, Potha Raju , Pothu Raju , Devotional , Grama Devata, Lord Shiva , Paravathi

గ్రామాల్లో ఉండే పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ ఎల్లమ్మ, పెద్దమ్మ, మాంకాళమ్మ, పొలేరమ్మ, మాతమ్మ, మావూళ్లమ్మ… వంటి దేవతలకు అన్న వేళలా అండగా ఉండే వాడే పోతరాజు.ఆయననే కొన్నిచోట్ల పోతురాజు అని కూడా పిలుస్తారు.అసలు పోతరాజు అమ్మవార్లకు కాపలాగా ఎందుకు మారాడో తెలుసుకుందాం.

 What Is The Reason Behind Potharaju Protect Grama Devathalu, Potha Raju , Pothu-TeluguStop.com

అమ్మ, అమ్మవారు, తల్లి లాంటి పేర్లతో మొత్తం మనకు ఏడుగురు దేవతలు ఉన్నారు.ఆ సప్త మాతృలకు పోతరాజే సోదరుడు.పురాణాల ప్రకారం శివపార్వతులకు కుమారులు కలిగాక… ఒకనాడు వారు విహారానికి వెళ్తారు.

అక్కడ పార్వతీదేవి ఓ కొలను లోంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారు.నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం అర్ధం కాని పార్వతీదేవి పరమేశ్వరుడి చెంతకు చేరింది.

ఇదేంటని ప్రశ్నించగా… వారి జన్మ రహస్యం గురించి వివరిస్తాడు శివుడు.

Telugu Devotional, Potharaju, Pothuraju-Telugu Bhakthi

అమ్మవారు ఆ కూతుళ్లను వెంట తీసుకెళ్దామంటే… శివుడు వారించి వద్దంటాడు.ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అని… మన మాట వినరని వివరిస్తాడు.అందుకే వారిని ఇక్కడే వదిలేసి వెళ్దామంటాడు.

వారికి కాపాలాగా ఒక గణాన్ని సృష్టిస్తారు.అతడికి పోతరాజు అని పేరు కూడా పెడ్తారు.

ఆ ఏడుగురిని పోతరాజే కాపాడాలని చెప్పి… పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతరాజు… వారికి కాపాలా కాస్తూనే ఉన్నాడు.

ఆ ఏడుగురే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి.ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ అంటూ… ఒక్కో చోటు ఒక్కోలా పిలుచుకుంటుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube