గుడుల్లో కానీ.వినాయక చవితి లేదా దేవీ నవరాత్రి ఉత్సవాలప్పుడు మండపాల్లో నిలబట్టిన దేవతా మూర్తుల ముందు నేరుగా నిలబడి దండం పెట్టుకోకూడదని పెద్దలు చెబుతుంటారు.
అంతే కాకుండా దేవుడి విగ్రహానికి ఓ పక్కగా నిలబడి నమస్కరించాలంటారు.ఇలా ఎందుకు చెబుతారో అందులో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్వామి వారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానిరి మధ్యలో కూడా మనం నిలబడకూడదట.
దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది.ప్రధానంగా మూల విరాట్టును ప్రతిష్టించే సమయంలో వేద మంత్రాలు పఠిస్తారనే విషయం మన అందరికీ తెలిసిందే.అయితే గర్భ గుడిలో మహా శక్తులను నిక్షిప్తం చేస్తారు.
గుడిలో యంత్ర బలంతో పాటు మంత్ర బలం కూడా ఉంటుంది.ప్రాణ ప‌్రతిష్ట చేసే సమయంలో స్వామి వారి శక్తిని మనం తట్టుకోలేం.
అందుకే దేవుడు లేదా దేవతకు ఎదురుగా నిలబడ కూడదని చెబుతుంటారు.ముఖ్యంగా శివుడు, కాళీ మాత ఆలయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలట.
అందుకే శివలింగాన్ని ముందుగా నంది కొమ్ముల మధ్య నుంచి చూశాకే దర్శనం చేసుకోవాలని కూడా చెబుతుంటారు.అలాగే కొన్ని ఆలయాల్లో నేరుగా సూర్య కిరణాలు గర్భగుడిలో పడుతుంయాట.
అలా కూడా మనం అడ్డు ఉండకూడదనే స్వామి వారికి ఎదురుగా నిల్చొని దర్శనం చేసుకోకూడదని చెబుతుంటారు.ఏది ఏమైనప్పటికీ… ఓ పక్కగా నిలబడి దర్శనం చేసుకోవడమే చాలా మంచిదని పెద్దలు, పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.