శివాజీ గణేషన్ కు గూగుల్ అందించిన అరుదైన గౌరవం ఏంటంటే...??

సినీ రంగానికి పరిచయం అక్కర్లేని పేరు ఏదన్నా ఉంది అంటే అది శివాజీ గణేషన్ పేరు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.తెరమీద ఆయన పోషించిన నటన ఎంతోమంది సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది.

 What Is The Rare Honor Given By Google To Shivaji Ganesan Details, Shivaji Ganes-TeluguStop.com

భారతీయ సినిమా చరిత్రలో మార్లన్ బ్రాండోగా ఆయన పేరుగాంచారు.అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ భాషలలో కూడా నటించి అన్ని వర్గాల వారికి దగ్గర అయ్యారు.

ఈరోజు శివాజీ గణేషన్ 93వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ ఆయన కోసం ఒక ప్రత్యేకమైన డూడుల్‌ను క్రియేట్ చేసి ఆయనకు నివాళిని అర్పించింది.ఇది ఆయనకు గూగుల్ అందించిన ఒక అరుదైన గౌరవంగా చెప్పవచ్చు.

ఈ గూగుల్ డూడుల్‌ను బెంగళూరుకు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ నూపుర్ రాజేష్ చోక్సి రూపొందించారు.ఆయన జయంతి సందర్భంగా శివాజీ గణేషన్ గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

శివాజీ గణేషన్ తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో గల విల్లుపురం అనే గ్రామంలో జన్మించారు.శివాజీ గణేషన్ కి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించడం అంటే మక్కువ ఎక్కువ.

ఆయన ఏడు సంవత్సరాల వయసులోనే నటించడం ప్రారంభించారు.నిజానికి ఆయన అసలు పేరు శివాజీ గణేషన్ కాదు.

ఆయన అసలు పేరు విల్లుపురం చిన్నయ్య గణేషన్.మరాఠా చక్రవర్తి శివాజీ పాత్రలో నటించి అందరిని మెప్పించారు.

ఆయన నటించిన శివాజీ పాత్రకు ఎంతో పేరు రావడంతో ఆయన దాన్నే తన పేరుగా మార్చుకున్నారు.అప్పటి నుండి ఆయన పేరు శివాజీ గణేషన్ గా మారిపోయింది.

Telugu Google, Latest, National Award, Rare, Shivajiganesan-Latest News - Telugu

ఈజిప్టులోని కైరోలో 1960లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివెల్లో శివాజీ గణేషన్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు.అమెరికాలోనూ శివాజీ గణేశన్ కు అనేక సత్కారాలు లభించాయి. క్షత్రియ పుత్రుడు సినిమాలో తేవర్ ముగన్ అనే పాత్రకు శివాజీ గణేశన్ కు జాతీయ అవార్డు లభించింది.అయితే దానిని ఆయన తిరస్కరించారు. అంతేకాకుండా ఫ్రెంచ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘చెవలీర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్’ అవార్డు కూడా ఆయనకు లభించింది.ఈయన 2001లో తన 73 సంవత్సరాల వయసులో మరణించారు.

ఇన్ని అవార్డులు, సత్కారాలు పొందిన మన శివాజీ గణేషన్ గారిని గూగుల్ ఇలా సత్కరించడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube