హరీష్ రావు పరిస్థితి ఏంటి...? గుంపులో గోవిందమేనా ...?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది.ఇంకా ఐదేళ్ల వరకు తిరిగి చూసుకోనవసరం లేదు.

 What Is The Position Of Harish Rao In Trs-TeluguStop.com

ఇప్పుడు ఆ పార్టీలో అంతా సెట్ రైట్ అయిపొయింది.ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే…? పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషిచేసిన కీలక వ్యక్తుల్లో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు దే కీలక పాత్ర.ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన హరీష్ రావు పార్టీ విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అయితే ఎన్నికల ముందే హరీష్ రావు ని కేసీఆర్ పక్కనపెట్టినట్టు … పొమ్మనలేక పొగపెట్టినట్టు అనుమానాలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది.అయితే….ఆ పరిణామాలు పార్టీకి డ్యామేజ్ చేసేలా కనిపించడంతో కేసీఆర్ రంగంలోకి దిగి అబ్బే అలాంటిది ఏమీ లేదు అంటూ కేసీఆర్ కవరింగ్ ఇచ్చాడు.

తరువాత అంతా సర్దుమణిగింది.ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో మళ్ళీ హరీష్ రావు ప్రస్తావన మొదలయ్యింది.

ప్రధానంగా… కేటీఆర్ కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు అప్పగించాక హరీష్ రావు పార్టీ వ్యవహారాల్లో నామమాత్రం అయిపోయారు.కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే మాత్రమే అన్నట్లుగా హరీష్ రావు మారిపోయారు.కేసీఆర్ కూడా హరీష్ ప్రాధాన్యం తగ్గించేసి … కేటీఆర్ హవా పెరిగేలా రాజకీయ పరిణామాలను మార్చేస్తున్నారు.ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత మొదటి రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా… కేటీఆర్ ని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పార్టీ వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుగా కనిపించింది.అయితే, హరీష్ రావు పైకి మాత్రం ఎటువంటి అసంతృప్తి పైకి కనిపించకుండా…తన సన్నిహితుల దగ్గర మాత్రమే ఈ విషయాలను ప్రస్తావించి ఆవేదన చెందుతున్నాడట.

ఓ వైపు కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా మారిపోతే… హరీష్ రావు మాత్రం సిద్ధిపేటకే పరిమితమయ్యారు.టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలంతా కేటీఆర్ ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉండగా హరీష్ రావు మాత్రం ఒంటరిగా మారిపోయారు.ఇప్పుడు తెలంగాణ లో టీఆర్ఎస్ రాజకీయం అంతా కేటీఆర్ చుట్టూనే తిరుగుతోంది.అలాగే ఈ మధ్యన ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సమీక్షలో కూడా హరీష్ రావు ఎక్కడా కనిపించలేదు.

ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శించిన సమయంలోనూ హరీష్ రావు లేరు.గత క్యాబినెట్ లో హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో హరీష్ చాలానే కృషి చేశారు.దీంతో అన్ని ప్రాజెక్టులపై హరీష్ రావుకు మంచి అవగాహన ఉంటుంది.

అలాంటప్పుడు హరీష్ ని పిలిచి ఉండాల్సి అని పార్టీ లో టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో అసలు హారీష్ కి మంత్రివర్గంలో కీలక స్థానం దక్కుతుందా…? అసలు మంత్రి పదవి దక్కుతుందా అనే అనుమానాలు కూడా… ప్రారంభం అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube