మలుపులు తిరుగుతున్న బెజవాడ రాజకీయం ! రాధా ఫ్యూచర్ ఏంటి..?     2018-09-20   12:20:19  IST  Sai M

బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఏపీ మొత్తం కూడా బెజవాడ రాజకీయాల చూస్తూనే తిరుగుతుంటుంది. ఇక్కడ ఏ చిన్న అలజడి జరిగినా ఏపీ అంత దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇదే పరిస్థితి. ఇక ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితి హాట్ హాట్ గా ఉంది. విజయవాడ సెంట్రల్ సీటు మీద ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకృషను కాదని జగన్ ఇప్పుడు ఆ సీటు మల్లాది విష్ణు కి కేటాయించాడు. ఈ నేపథ్యంలో అలిగిన రాధా వైసీపీ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

వాస్త‌వానికి వంగ‌వీటి రాధా గత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన విజ‌య‌వాడ తూర్పు స్థానాన్ని ఆయ‌న‌కు కేటాయించ‌డానికి వైఎస్ జ‌గ‌న్ దాదాపుగా అంగీక‌రించారు. అది కాదంటే మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటు ఇస్తామ‌ని ఆర్థికంగానూ ఇత‌ర అవ‌స‌రాల‌ను కూడా తామే తీరుస్తామ‌ని వైసీపీ నేత‌లు స్ప‌ష్టం చేసిన‌ట్టు ప్రచారం సాగుతోంది. అయితే విజ‌య‌వాడ‌ను వీడ‌డానికి రాధా సిద్ధంగా లేర‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో తూర్పు స్థానం త‌న‌కు సుర‌క్షితం కాద‌ని, గద్దె మీద విజయం అనేది చాలా కష్టం అని భావిస్తుండ‌డంతో సెంట్ర‌ల్ సీటుకే ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు.

కానీ విశాఖ‌లో జ‌రిగిన బ్రాహ్మ‌ణుల‌తో ఆత్మీయ స‌మావేశంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్టుగా రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు రెండు సీట్లు ఖాయం అయ్యాయి. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోన‌ ర‌ఘుప‌తి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బాప‌ట్ల‌తో పాటుగా బ్రాహ్మ‌ణ సంఘాలు కోరిన‌ట్టుగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ కూడా ఓకే చేసేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్ర‌ల్ సీటును, ఇప్ప‌టికే మ‌ల్లాది విష్ణుకి ఖాయం చేసేసింది. కాకపోతే ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బయటకి వెల్లడించారు అంతే.

What is the Political Future of Vangaveeti Radha Krishna-Elections In AP,telugu Politics,Vangaveeti Radha Krishna,What Is The Political Future Of Vangaveeti Radha Krishna,YCP,ys Jagan

అయితే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు కోసం జ‌న‌సేన గూటికి చేరాల‌ని భావిస్తున్న వంగ‌వీటి రాధాకి అక్క‌డ కూడా స్పష్ట‌త క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆ సీటుని వైసీపీ నుంచి జనసేనలో చేరబోతున్న ఓ కీలక నేతకు ఇచ్చేందుకు జనసేనాని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పోనీ టిడిపి లోకి రాధా వద్దాం అని భావించి వల్లభనేని వంశి తో చర్చించి, త్వరలో చంద్రబాబు ని కలుద్దాం అని ఆశించినా, అక్కడ ఇప్పటికే బోండా ఉమా ఉండటంతో టిడిపి ఆసక్తి చూపటం లేదని తెలుస్తుంది. దీంతో తన ఫ్యూచర్ ఏంటో తెలియక రాధా అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది.