కళ్యాణ్‌ రామ్‌ పై 60 కోట్లు పెట్టడం ఏంటి బాసూ.. మైండ్‌ ఏమైనా చెడిందా?

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌ ప్రారంభించి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తుంది.కాని ఇప్పటి వరకు ఆయన కమర్షియల్‌ సూపర్‌ హిట్‌ లు కేవలం రెండు మాత్రమే.

 What Is The Point Of Putting 60 Crores On Kalyan Ram Is The Mind Bad Anyway-TeluguStop.com

అవి కూడా భారీ బ్లాక్ బస్టర్ అనడానికి లేదు.బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన సినిమాలు ఇన్నాళ్ల ఏళ్ల కెరీర్‌ లో కేవలం రెండు మాత్రమే ఉన్న కళ్యాణ్‌ రామ్‌ ప్రమోగాలను మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు.

నందమూరి కళ్యాణ్‌ చేసినన్ని విభిన్నమైన పాత్రలు మరే యంగ్‌ హీరో చేయలేదు అనడంలో సందేహం లేదు.ఆయన నటనకు ఆస్కారం ఉన్న ఎన్నో సినిమాలు చేశాడు.

 What Is The Point Of Putting 60 Crores On Kalyan Ram Is The Mind Bad Anyway-కళ్యాణ్‌ రామ్‌ పై 60 కోట్లు పెట్టడం ఏంటి బాసూ.. మైండ్‌ ఏమైనా చెడిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కథల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు ఆయన జడ్జిమెంట్‌ విఫలం అయ్యింది.ఆయన సినిమా లు భారీ మొత్తాలను వసూళ్లు చేస్తాయంటే నమ్మకం తకువే.

అయినా కూడా సొంతంగా సినిమాలను నిర్మిస్తున్న కళ్యాణ్‌ రామ్‌ తనపై తానే ఎక్కువ మొత్తం పెట్టుకుంటూ వస్తున్నాడు.ఈసారి కళ్యాణ్‌ రామ్‌ చేయబోతున్న సినిమా బడ్జెట్‌ మరింత చర్చనీయాంశంగా మారింది.

కళ్యాణ్ రామ్‌ తో పాటు ఈ సారి మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమా నిర్మాణం విషయమై జత కట్టడం జరుగుతుంది.వీరి కాంబోలో రూపొందబోతున్న సినిమా కు గాను ఏకంగా 60 కోట్ల వరకు బడ్జెట్‌ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఇలాంటి చర్చలు జరిగాయా లేదా అనే విషయమై క్లారిటీ లేదు.అసలు కళ్యాణ్‌ రామ్‌ పై పాతిక కోట్లు పెట్టడమే చాలా ఎక్కువ.అలాంటిది ఇంత బడ్జెట్ పెడుతున్నారు అంటూ వార్తలు రాస్తున్న వారికి ఏమైనా మైండ్ చెడిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కాని ఇక్కడ నిప్పు లేనిదే పొగ రాదు అంటూ కొందరు అంటూ ఉంటారు.

అంటే ఖచ్చితంగా ఏదో క్లూ ఉండబట్టే 60 కోట్ల బడ్జెట్‌ వార్తలు బయటకు వచ్చాయి.కనుక దీన్ని పూర్తిగా కొట్టి పారేయలేం అనిపిస్తుంది.

మొత్తానికి కళ్యాణ్‌ రామ్‌ సినిమా బడ్జెట్‌ ప్రస్తుతం టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

#Kalyan Ram #60 Crores #MythriMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు