కేసీఆర్ సైలెంట్ వెన‌క ఉన్న ప్లాన్ ఏంటి.. మాట‌ల మాంత్రికుడికి ఏమైంది..?

What Is The Plan Behind Kcr Silent What Happened To The Magician Of Words

కేసీఆర్ ఒక మాట అన్నారంటే దాని వెన‌క ఎన్నో అర్థాలు ఉంటాయ‌నేది రాజ‌కీయాల్లో అందరికీ తెలుసు.అలాంటిది ఈ న‌డుమ ఆయ‌న మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌నే ఆయ‌న నిజం చేసుకుంటున్నారు.

 What Is The Plan Behind Kcr Silent What Happened To The Magician Of Words-TeluguStop.com

అలాంటి వాటిని ప‌క్క‌న పెట్టేయాల్సింది పోయి వాటినే ప‌దే ప‌దే చేయ‌డం అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.మొన్న‌టికి మొన్న ద‌ళిత బంధు మీద ఇలాంటి వాగ్ధానాలు చేసి చివ‌ర‌కు చ‌డీ చ‌ప్పుడు లేకుండా పోయింది.

న‌వంబ‌ర్ 4 నుంచే ద‌ళిత బంధును ఇస్తామ‌న్న కేసీఆర్ ఆ త‌ర్వాత మాత్రం దాని ఊసే ఎత్త‌ట్లేదు.ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామ‌ని చెప్పి వ‌చ్చి సైలెంట్ అయిపోయారు.

 What Is The Plan Behind Kcr Silent What Happened To The Magician Of Words-కేసీఆర్ సైలెంట్ వెన‌క ఉన్న ప్లాన్ ఏంటి.. మాట‌ల మాంత్రికుడికి ఏమైంది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేంద్రంపై యుద్ధం చేస్తామ‌ని వ‌డ్ల కొనుగోలు విష‌యంలో తాడో పేడో తేల్చుకుంటామ‌ని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఏ మాత్రం చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఊసూరుమంటూ రావ‌డం పెద్ద నిరాశ‌ను క‌లిగించింది.అయితే ఢిల్లీకి వెళ్ల‌క ముందు కేసీఆర్ ఓ మాట చెప్పారు.

ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన త‌ర్వాత రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ పంట‌లు వేసుకోవాలో చెబుతామ‌ని చెప్పిన కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు.ఇక ఢిల్లీలో కూడా కేసీఆర్ కు మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌ని టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నారు.

Telugu Amith Sha, Central, Delhi, Formmers, Modi, Paddy, Ts Potics-Latest News - Telugu

మ‌రి అదే విష‌యాన్ని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఉంటే ఇంకా బాగా వ‌ర్కౌట్ అయ్యేది క‌దా అని అంతా అనుకుంటున్నారు.ఢిల్లీ పర్యటన వివ‌రాల‌ను ఎందుకు వెల్ల‌డించ‌ట్లేదు అనేది పెద్ద ప్ర‌శ్న‌.అయితే కేసీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్ల‌క ముందు చేసిన మాట‌లే ఆయ‌న‌కు అపాయింట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మంటూ చెబుతున్నారు.వెంట‌నే ఏదీ చెప్ప‌కుండా ఒక‌టి లేదా రెండు రోజులు ఆగిన త‌ర్వాత ఏదో ఒక‌టి చెబితే బాగుంటుద‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారంట‌.

వెంట‌నే ఏదో ఒక‌టి చెప్పేస్తే త‌న ప‌రువు పోతుంద‌ని, కాస్తా ఆలోచించి ఏది చెప్పాలో అదే చెప్పేస్తే ప‌నైపోతుంద‌ని భావిస్తున్నారంట‌.

#Potics #Modi #Delhi #Central #Amith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube