పట్టభద్రులు టీఆర్ఎస్ పై ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారంటే?

దుబ్బాక ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుకున్న రీతిలో ఫలితాలు రాక ఈ ఫలితాలు టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.అయితే కొంత ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కొద్దిగా ప్రతిపక్షాలకు లాభించగా, ప్రభుత్వ వైఫల్యాలు కొంత టీఆర్ఎస్ కు నష్టం కలిగించాయని చెప్పవచ్చు.

 What Is The Opinion Of The Graduates On Trs ,mlc Elections, Kcr, Trs Party, Grad-TeluguStop.com

అయితే అవి సాధారణ ప్రజలు కాబట్టి ప్రలోభాలకు గురి చేయడం వల్లనో లేక తాయిలాల వలనో ఫలితాలు ఉంటాయి.కాని త్వరలో జరిగేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.

ఈ ఎన్నికల్లో గెలవడం ఆశామాషీ కాదు.కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే మొదటి ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోయినా సంక్షేమ పథకాల అమలులో ప్రభత్వానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.అయితే ఈ సారి సీన్ పూర్తి రివర్స్ గా మారింది.

ఇప్పుడు నిరుద్యోగులు ప్రభుత్వంపై పూర్తి అగ్రహంతో ఉన్నారు.అయితే ఈ ఆగ్రహాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఓటు రూపంలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఒక్కసారి ఓడిపోతే ప్రజాగ్రహం అనేది స్పష్టంగా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంది.ఇప్పుడు అంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై అందరి దృష్టి నెలకొంది.

చూద్దాం పట్టభద్రుల నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube