తులసి అంటే అర్థం ఏమిటి..కార్తీక మాసంలో తులసికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు కనుక ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్క తప్పనిసరిగా దర్శనమిస్తుంది.అయితే కార్తీక మాసంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

 What Is The Meaning Of Tulsi Do You Know Why Tulsi Is Preferred In The Karthika Month , Tulsi Plant, Meaning, Karthika Masam, Worship, Hindu Belives-TeluguStop.com

ఈ కార్తీక మాసంలో పెద్ద ఎత్తున తులసి చెట్టుకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా నేడు క్షీరాబ్ది ద్వాదశి కావడంతో తులసి చెట్టుకు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను చేస్తారు.

కార్తీక మాసం పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పవిత్రమైనది.ఈరోజు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు వివాహం జరిపించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

 What Is The Meaning Of Tulsi Do You Know Why Tulsi Is Preferred In The Karthika Month , Tulsi Plant, Meaning, Karthika Masam, Worship, Hindu Belives-తులసి అంటే అర్థం ఏమిటి..కార్తీక మాసంలో తులసికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవతలు సాగరమధనం చేశారని చెబుతారు.ఇలా నేడు సాగరమధనం చేయటం వల్ల ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు.

ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొంటాడు.ద్వాదశిరోజు విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా తులసి వనానికి వచ్చి తులసితో కలిసి పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తారు.

కనుక క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసికోటలో ఉసిరి కొమ్మను నాటి రెండింటికి వివాహం జరిపించి పూజలు చేస్తారు.

తులసి అంటే పోల్చలేనిది అనే అర్థం వస్తుంది.

ఉసిరి అంటే దాత్రి ధరించేది అని అర్థం జ్ఞానాన్ని బుద్ధిని ధరించి అజ్ఞానాన్ని తొలగించేదిగా భావిస్తారు.కనుక ఉసిరి కొమ్మను నారాయణుడిగా తులసి కొమ్మను లక్ష్మీ దేవిగా భావించి ఈ రోజు పెద్ద ఎత్తున వివాహ వేడుకలను జరిపిస్తారు.

ఇలా క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.అందుకోసమే కార్తీక మాసంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రోజు దీపారాధన చేస్తుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube