పండ్ల పై స్టికర్ అర్ధం ఏంటంటే?

మనలో చాలామంది పండ్లు కొనే సమయంలో వాటిపై స్టిక్కర్లు ఉండటం గమనిస్తూ ఉంటారు.అయితే ఆ స్టిక్కర్ ఏంటి…? వాటిని ఎందుకు అతికించారు.? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.అయితే ఆ స్టిక్కర్ల ద్వారా ఆ పండును ఏ విధంగా పండించారో మనం సులభంగా తెలుసుకోవచ్చు.

 What Those Little Stickers On Fruits Are For, Stickers On Fruits, Naturally,conv-TeluguStop.com

యాపిల్, పియర్స్, బత్తాయి, కివీ పండ్లపై స్టిక్కర్లు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి.ఆ స్టిక్కర్ల ద్వారా మనం పండ్లను సహజ సిద్ధంగా పండించారా…? కెమికల్స్ తో పండించారా…? అనే విషయం తెలుసుకోవచ్చు.

స్టిక్కర్లపై ఉండే నంబర్లు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాయి.పండ్లపై ఉన్న స్టిక్కర్ పై మూడు లేదా నాలుగు నంబర్ తో మొదలైన సంఖ్య ఉంటే ఆ పండ్లను కొన్ని సహజసిద్ధమైన ఎరువులు, కొన్ని కెమికల్స్ సహాయంతో పండించారని అర్థం.

రెండు విధాలుగా పండించిన పండ్లకు మాత్రమే మూడు లేదా 4 నంబర్ తో మొదలైన స్టిక్కర్ ను వేస్తారు.ఒకవేళ పండ్లపై ఉన్న స్టిక్కర్ 9 అనే నంబర్ తో మొదలు పెడితే వాటిని సహజసిద్ధంగా పండించారని అర్థం చేసుకోవాలి.

సేంద్రీయ ఎరువులతో సహజసిద్ధంగా పండించిన పండ్ల వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి.అందువల్ల ఇలాంటి పండ్లను తినడానికి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తే మంచిది.పండ్లపై ఉన్న స్టిక్కర్ పై సంఖ్య 8 అనే నంబర్ తో మొదలైతే మాత్రం జన్యు మార్పిడి ద్వారా ఆ పండ్లను పండించారని అర్థం చేసుకోవాలి.అలాంటి పండ్లను తినకపోవడమే మంచిది.

పండ్లను కొనే ముందు వాటిపై ఉండే స్టిక్కర్లను తప్పనిసరిగా గమనిస్తే ఎలాంటి పండ్లను కొనాలో, ఎలాంటి పండ్లను కొనకూడదో సులభంగా అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube