తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో తెలుసా?

మన హిందూ వివాహ వేడుకల్లో ‘తలంబ్రాలు’ అనేవి వధూవరులు చాలా సరదాగా పోసుకొనే ఒక తంతు.ఈ తంతులో వధూవరులు ఇద్దరూ పసుపు కలిపిన అక్షింతలను దోసిడిలో పోసుకోవటం చూస్తూ ఉంటాం.

 What Is The Meaning-of Showering Rice-TeluguStop.com

తలంబ్రాలను మొదట పురోహితుడు ఎండు కొబ్బరి చిప్పలో పోసి ఆవునెయ్యిని జల్లి మంత్రాలను జపిస్తూ వధూవరుల దోసిడిలో పోస్తారు.వారి దాంపత్యం కలకాలం నిలవాలని పురోహితులు మంత్రాలను జపిస్తూ తలంబ్రాలను వధూవరుల చేత పోయిస్తారు.

రెండో సారి తలంబ్రాలను పోసినప్పుడు జపించే మంత్రాలలో సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలని దీవిస్తారు.

బియ్యంలో పసుపు కలిపి తలంబ్రాలను తయారుచేస్తారు.

కొన్ని ప్రాంతాల్లో తలంబ్రాలుగా జొన్నలను వాడతారు.మన పూర్వికులు తలంబ్రాలుగా బియ్యాన్ని ఎందుకు వాడటం ప్రారంభించారంటే బియ్యంలో జీవగుణం లేకపోవటం కారణం.

అంతేకాక తలంబ్రాలు పోసుకొనే సమయంలో పఠించే మంత్రాలలో కూడా వ్యక్తిగత శ్రేయస్సు కాకుండా విశ్వ శ్రేయస్సును కాంక్షించే స్వభావం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube