సినిమాలో గ్రాస్ కలెక్షన్.. నెట్ కలెక్షన్ అంటే ఏంటో మీకు తెలుసా?

సినిమాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.చక్కటి కథలకు తోడు.

 What Is The Meaning Of Gross Collections And Net Collections-TeluguStop.com

అద్భుతమైన టెక్నాలజీ యాడ్ కావడంతో ఓరేంజిలో తెరకెక్కుతున్నాయి.అందుకే సినిమా నిర్మాణం విషయంలో నిర్మాతలు ఎంత డబ్బు కావాలంటే అంత పెడుతున్నారు.

రకరకాల పద్దతుల్లో కనీసం పెట్టిన డబ్బు అయినా వస్తుంది తప్ప.నష్టం రాదనే ధీమాలో ఉంటుందన్నారు ప్రొడ్యూసర్లు.

 What Is The Meaning Of Gross Collections And Net Collections-సినిమాలో గ్రాస్ కలెక్షన్.. నెట్ కలెక్షన్ అంటే ఏంటో మీకు తెలుసా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు.సినిమాలు సైతం ఓ రేంజిలో హిట్ అవుతున్నాయి.

తక్కువ సంఖ్యలో సినిమాలు మాత్రమే ఫ్లాప్ అవుతున్నాయి.

అయితే సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు తరుచుగా బాక్సాఫీస్ అనే మాట వినిపిస్తోంది.ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయనో.లేదంటే ఘోర పరాజయాన్ని పొందాయనో వింటుంటాం.దీనితో పాటు పలు పత్రికలు, న్యూస్ చానెల్స్ లో పలానా సినిమా గ్రాస్ కలెక్షన్ ఇంత సాధించింది.నెట్ కలెక్షన్ ఇంత వసూళు చేసిందని చూస్తుంటాం.

అయితే ఇంతకీ గ్రాస్ కలెక్షన్ అంటే ఏంటి? నెట్ కలెక్షన్ అంటే ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Facts Behind Movie Collections, Gross Collections, Movie Facts, Movie Producers, Movie Tickets, Movies Terminology, Net Collections-Telugu Stop Exclusive Top Stories

సినిమా టికెట్ మీద పెట్టిన మొత్తం డబ్బులన్నీ కౌంట్ చేసే విధానాన్ని గ్రాస్ కలెక్షన్ అంటారు.ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మైనస్ చేశాక వచ్చిన డబ్బులను నెట్ కలెక్షన్ అంటారు.అయితే ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు.

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది.మొత్తంగా టికెట్ అమ్మితే వ‌చ్చిన టోట‌ల్ అమౌంట్ గ్రాస్ క‌లెక్ష‌న్ కాగా.

గ్రాస్ క‌లెక్ష‌న్ నుండి టాక్స్ ల‌ను తీయ‌గా వ‌చ్చేది నెట్ క‌లెక్ష‌న్.పలు సినిమా విషయంలో గ్రాస్ క‌లెక్ష‌న్ నే బయటకు చూపిస్తారు నిర్మాతలు.

తమ తదుపరి సినిమాల్లో లాభం పొందేందుకు తాము చేసిన పలనా సినిమా భారీగా గ్రాస్ క‌లెక్ష‌న్ సాధించింది అని చెప్తారు.అందేకాదు.

ప్రసార సాధనాలు కూడా సినిమాల వసూళ్లకు ఎక్కువగా గ్రాస్ క‌లెక్ష‌న్ మీదే ఫోకస్ చేస్తాయి.

#Net Collections #FactsBehind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు