మ్యాజిక్‌ చేసే వారు చెప్పే 'అబ్రకదబ్ర' అసలు అర్థం ఏంటో తెలుసా?

చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా మందికి మ్యాజిక్‌ అంటే చాలా ఇష్టం.మ్యాజిక్‌ చేసే మ్యూజిషియన్స్‌ ఎక్కువగా అబ్రకదబ్ర అబ్రకదబ్ర అంటూ మంత్రం చెబుతూ ఉంటారు.

 What Is The Meaning And History Of Abracadabra-TeluguStop.com

దబ్రకఅబ్ర అంటూ దాన్నే అటు ఇటు తిప్పి తిప్పి చెబుతూ ఉంటారు.ఈ పదం అసలు ఏ లాంగ్వేజ్‌కు చెందినది, దీని అర్థం ఏంటీ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అబ్రకదబ్ర అనేది ఏదో తాంత్రిక పదం కాదు, దాని వల్ల మాయలు ఏం జరిగి పోవు.చాలా మంది అబ్రకదబ్ర అనేది ఒక మంత్రం అని దాన్ని జాగ్రత్తగా చెబితే ఏదైనా జరుగుతుందేమో అనుకుంటారు.

అబ్రకదబ్ర అనేది ఈమద్య కాలంలో మొదలైన పదం కాదు.చరిత్ర కారులు చెబుతున్న దాని ప్రకారం ఈ పదం అనేది కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది.

ఈపదంను అరబిక్‌ భాష నుండి తీసుకున్నట్లుగా చరిత్ర కారులు చెబుతున్నారు.avra kadavra అనే పదం నుండి దీన్ని మొదట తీసుకున్నట్లుగా చెబుతున్నారు.avra kadavra అనే పదం కాల క్రమేనా Abracadabra గా మారిపోయింది.దీని అర్థం గురించి గూగుల్‌లో వెదికినా లేదంటే ట్రాన్స్‌లేట్‌లో వెదికినా డిక్షనరీలో వెదికినా సరైన అర్థం మాత్రం లేదు.

Telugu Century Poem, Avra Kadavra, Abracadabra, Mystical Word-

దీన్ని విడి విడిగా తీసి అర్థం చేసుకున్నట్లయితే తండ్రి అనే వాడు కొడుకుకు దైవంతో సమానం అనే అర్థం వస్తుందని అరబిక్‌ పండితులు చెబుతున్నారు.మ్యాజిక్‌కు తండ్రి అనే వాడు దైవంతో సమానం అనే దానికి సంబంధం లేదు.కాని లాజిక్‌ లేకుండా అబ్రకదబ్రను మ్యాజిక్‌ చేసే మ్యుజీషియన్స్‌ వాడుతున్నారు.పూర్వ కాలంలో మంత్రగాళ్లు తంత్రగాళ్లు దీన్ని వాడే వారు.క్రిస్టియన్స్‌ కూడా సైతాన్‌లను వదిలించేందుకు దీన్నే వాడేవారట.ఇప్పుడు మ్యాజిక్‌ చేసే మ్యుజీషియన్స్‌ దీన్ని వాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube