నైవేధ్యం అంటే ఏంటి?ఏ ఏ దేవుడికి ఏ పదార్ధాలను నైవేధ్యంగా పెట్టాలి??  

What Is The Mean By Naivedyam And Favorite Foods Of Gods-

Many of us are worshiping God daily .. Those who are not able to go to the house are worshiping God at home..It is a blessing to God as a part of the Pujas .. If some people have a favorite ingredient, some others will take care of their ingredients. According to the foundations, our gods will love any ingredients, and learn what dough will eat.

The word 'offerings' comes from Sanskrit. Nothing is like submission to God. It should not be eaten before God can not be eaten. So God does not taste when cooking food for food. It should be taken only after submitting to God ..

Shiva: .

He takes the milk and the ingredients he loves. He likes the food and the sweet cuisine made of saffron. Some people, however, are sturdy and eat foods made of yoghurt as shiva. Nayanar:

. Maha Vishnu is very fond of yellow grams. And it's just a little jaggery to cook them. That is why when Lord Vishnu is worshiped with devotion, the yellow ladders are given to him as a gift.

Sri Krishna: .

Srikrishna is known as the youngest in his childhood. Butter is like that. Stolen the butter in the side houses and eating too much. He is so sweet that he is very happy. It includes sugar. Even the laddoo with coconut is preferred to Sri Krishna. The dishes are placed in front of him at the time of worship Ganesha devotees ..:.

. Bodhisattipaya Vinayakuda is a great love for lududas and kudu. While worshiping Vigyaneshwara, he is placed as a piece of food.

Hanuman: .

He will take red grains for Hanuman. Bellanto them soaked in water mixed with red kandibedalanu svamivari tirustadata desires us to worship in front of the box naivedyanga .. Lord Shani.

మనలో చాలామంది రోజూ దేవుని పూజిస్తాం.గుడికి వెళ్లే వీలు లేని వారు ఇంట్లోనే దేవుని పూజిస్తుంటారు..

నైవేధ్యం అంటే ఏంటి?ఏ ఏ దేవుడికి ఏ పదార్ధాలను నైవేధ్యంగా పెట్టాలి??-What Is The Mean By Naivedyam And Favorite Foods Of Gods

పూజలో భాగంగా దేవునికి నైవేధ్యం పెడుతుంటాం.కొందరు దేవుడికి ఇష్టమయిన పదార్ధాలను పెడితే ,మరికొందరు తమకు తోచిన పదార్ధాలను నైవేధ్యంగా పెడుతుంటారు.అసలు నైవేధ్యం అంటే ఏంటి? పురణాల ప్రకారం మన దేవుళ్ళకు ఎటువంటి పదార్థాలు ఇష్టమో, ఏ పిండివంటలను ఇష్టంగా భుజిస్తారో తెలుసుకుందాం.

నైవేద్యము అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే దేవునికి సమర్పణ అని అర్దం.నైవేధ్యం అనేది దేవుడికి పెట్టకముందు తినడం చేయకూడదు.

అందుకనే దేవుడి నైవేధ్యం కోసంవండే ఆహారపదార్ధాలను వండేటప్పుడు రుచి చూడరు. దేవుడికి సమర్పించిన తర్వాతనే దానిని తీసుకోవాలి.

శివుడు:

పరమశివుడికి పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు.ఇంకా కుంకుమపువ్వుని కలిపి చేసిన ఆహారపదార్థాలు, తియ్యటి వంటకాలన్న ఆయన ఇష్టపడతాడు.

అయితే కొంతమంది భంగు, పెరుగుతో చేసిన ఆహార పదార్థాలను శివుడికి నైవేద్యంగా ఉంచుతారు.

నారాయణుడు:

మహావిష్ణువుకు పసుపు కాయ ధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడట. ఇంకా వీటికి కొంచెం బెల్లంకలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణంగల లడ్డులను ఆయనకు నైవేద్యంగా పెడతారు.

శ్రీకృష్ణుడు:

.

శ్రీకృష్ణుడుకి బాల్యంలోనే వెన్నదొంగగా పేరుంది. వెన్న అంటే అంత ఇష్టం.

పక్క ఇళ్ళలో ఉన్న వెన్నను దొంగిలించి మరీ తినేవాడట. అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహా ప్రీతి. అందులో చక్కర కలుపుకొని ఆరగించేవాడట..

ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట. ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు.

వినాయకుడు:

బొజ్జగణపయ్య వినాయకుడికి లడ్డూలు, కుడుములన్నా మహా ప్రీతి.విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు.

హనుమంతుడు:

.

హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు. ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మనకు కోరికలను తీరుస్తాడట.

శనిదేవుడు:

.

శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం. నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు.అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు.

లక్ష్మిదేవి:

.

అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మిదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు. బియ్యంతో చేసిన ఖీర్ ను లక్ష్మిదేవి ఇష్టంగా స్వీకరిస్తారు.

సరస్వతి:

.

చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో, మంచి బుద్ధి, చదువు ప్రసాదించాలని ఖిచిడీని నైవేద్యంగా ఉంచుతారు.

దుర్గ:

.

ప్రపంచాన్ని రక్షిస్తున్న, శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడీ లేదా తియ్యటి ఖీర్ ను పూజకు ఉపయోగిస్తారు. దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట.

కాళికామాత:

.

ధైర్యం,బలాన్నిచ్చే కాళికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు.బియ్యంతో చేసిన తియ్యటి పదార్థాలు, కూరగాయలు,ఖీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు.

ఏ వంటకాలైన సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు..