కౌశిక్ విష‌యంలో కేసీఆర్ స్ట్రాట‌జీ అదేనా..?

తానొక‌టి అనుకుంటే దైవం మరొక‌టి త‌లిచింద‌న్న‌ట్టు త‌యారయింది కౌశిక్‌రెడ్డి ప‌రిస్థితి.ఆయ‌న హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి అవుతాడ‌ని అనుకుంటే చివ‌ర‌కు టీఆర్ ఎస్‌లో చేరి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు.

 What Is The Kcr Strategy In The Case Of Kaushik, Kaushik, Kcr, Koushik Reddy Mlc-TeluguStop.com

పోనీ టీఆర్ఎస్ త‌ర‌ఫున అయినా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో అనుకుంటే అక్క‌డ కూడా అవ‌కాశం రాలేదు.ఇక ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి మాత్రం ఇస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇక దీంతో అయినా సంతోషిద్దాం అనుకునే లోపే మ‌రో షాక్ వ‌చ్చి ప‌డింది.కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ ప‌ద‌వికి అర్హుడ‌య్యే ఫైల్‌పై గ‌వ‌ర్న‌ర్ ఇంకా సంత‌కం పెట్ట‌లేదు.

ఆ ఫైలును ఆమె ద‌గ్గ‌రే పెట్టుకున్నారు.దీనిపై పూర్తిగా స్ట‌డీ చేయాలంటూ దాన్ని ఆపేశారు.దీంతో ఎమ్మెల్సీ కావాల‌న్న కౌశిక్‌రెడ్డి క‌ల అలాగే మిగిలిపోయింది.వాస్త‌వానికి కేసీఆర్ ఒక నిర్ణ‌యం తీసుకున్నారంటే మాత్రం వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చేస్తాయి.

ఎందుకంటే ఆయ‌న అన్నీ ఓకే అనుకున్న త‌ర్వాత‌నే నిర్ణ‌యం తీసుకుంటారు.అలాంటి కౌశిక్ విష‌యంలో రెండు నెలలైనా ఇంకా అమల్లోకి రాకపోవడాన్ని చూస్తుంటే ఇది కావాల‌ని జ‌రుగుతోందా అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.

ఇక అటు కాంగ్రెస్ కూడా కౌశిక్‌రెడ్డిని తీవ్రంగా అవ‌మానిస్తోంది.

Telugu Cm Kcr, Kaushik, Kcr, Telangana, Trs-Telugu Political News

ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ మ‌రో స్ట్రాట‌జీ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.గవర్నర్ ద‌గ్గ‌ర ఫైల్ ఇంకా పరిశీలనలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది కాబ‌ట్టి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప‌నే చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంతి.అక్క‌డి సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కూడా ఇలాగే ఓ 12 మందిని ఎమ్మెల్సీలు చేసేంద‌కు ఫైలును పంపించ‌గా అక్క‌డి గవర్నర్ ఇలాగే ఆపేశారు.

దీంతో ఆయ‌న చేసేది లేక చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్‌కు వ్య‌తిరేకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది.ఇప్పుడు కేసీఆర్ కూడా గ‌వ‌ర్న‌ర్‌కు వ్య‌తిరేకంగా కోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతున్న‌ట్టు టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube