వైసీపీ విషయంలో కేసీఆర్ స్టెప్ ఏంటో...?  

What Is The Kcr Decision About Ys Jagan -

ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హిట్ పెంచేందుకు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు.తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకుండా చూసుకునేందుకు టీడీపీ ప్రత్యర్థి పార్టీలకు సపోర్ట్ చేసేందుకు గత కొద్ది రోజులుగా కేసీఆర్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నాడు.

What Is The Kcr Decision About Ys Jagan

ఈ నేపథ్యంలోనే 14వ తేదీ విశాఖపట్నంలో శారదా పీఠం లో జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తున్నట్టు ప్రకటించారు.ఇప్పుడే వైసీపీ అధినేత జగన్ తో కేసీఆర్ భేటీ ఉంటుందని వార్తలు కూడా వినిపించాయి.

వాస్తవంగా అదే రోజు జగన్ గృహప్రవేశ కార్యక్రమం కూడా ఉండడంతో ఈ భేటీ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే జగన్ గృహప్రవేశ కార్యక్రమం రద్దు కావడంతో ఈ భేటీ వాయిదా పడిందని అనుకున్నారు.

వైసీపీ విషయంలో కేసీఆర్ స్టెప్ ఏంటో…-Political-Telugu Tollywood Photo Image

అయితే కేసీఆర్ మాత్రం వైసీపీ కి చెందిన కీలక నేతలతో సమావేశం అవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీకి కేసీఆర్ సపోర్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా… నష్టమే ఎక్కువ ఉంటుంది అనే భావన కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో….కేసీఆర్ రాక ఆసక్తి కలిగిస్తోంది.అయితే, ఫెడరల్ ఫ్రెంట్ కి సంబంధించిన అంశమై ఏపీలోనే చర్చ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల నుంచి మరో వాదన వినిపిస్తోంది.

మరో పక్క చూస్తే… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా దూసుకెళ్తున్న పరిస్థితి.మరి, ఏపీ పర్యటనను తన ఫెడరల్ ఫ్రెంట్ కు వేదికగా కేసీఆర్ మార్చుకుంటారా లేదా అనే తెలియాలి.

ప్రస్తు

తం ఏపీలో అధికార పార్టీ టీడీపీ మంచి దూకుడుగా ఉంది.రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది.ఈ దూకుడికి అడ్డుకట్ట వేయడంలో వైసీపీ విఫలమయినట్టుగా కనిపించడంతో అధికార పార్టీ మరింతగా దూకుడు ప్రదర్శిస్తోంది.పాదయాత్ర ముగిశాక వైసీపీ కొంత వేగం తగ్గిన వాతావరణం కనిపిస్తోంది.

కొత్త సంక్షేపథకాల అమలు, పెన్షన్ల పెంపు, కియా మోటార్స్ ప్రారంభం, రాయలసీమ జిల్లాల్లోకి సాగునీరు.ఇలాంటివన్నీ అధికార పార్టీకి మరింత ఊపు తెస్తున్నాయి.

దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఓటర్ల జాబితా అవకతవకలు లాంటి అంశాలను తెరమీదికి తెస్తున్నా.ప్రభావం పెద్దగా ఉండటం లేదు.

దీంతో వైసీపీ కి ఏదో ఒక బలమైన శక్తి కావాలి .ఆ బలం టీఆర్ఎస్ పార్టీ అవుతుందా ….అనే విషయంలో క్లారిటీ రావాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Is The Kcr Decision About Ys Jagan- Related....