జపం అంటే ఏమిటి...జపం చేయటానికి నియమాలు ఉన్నాయా?  

What Is The Japam-

దేవుణ్ణి ఆరాదించటానికి జపం అనేది ఒక మార్గం.ఈ జపాన్ని అందరు సులభంగా చేయవచ్చు.

What Is The Japam- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) What Is The Japam--What Is The Japam-

అయితే మొక్కుబడిగా, కాలక్షేపం కోసం కాకుండా పద్దతి ప్రకారం జపాన్ని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.అయితే రోజులో ఎన్ని సార్లు జపం చేయాలి.జపం చేయటానికి ఉన్న నియమాల గురించి తెలుసుకుందాం.

జపాన్ని మూడు రకాలుగా చేయవచ్చు.బయటకు వినిపించేలా నామాలను ఉచ్చరిస్తూ, శబ్దాలేవీ బయటకు రాకుండా పెదాలతో చేసే జపం, ఇక మూడోవది మనస్సులో చేసుకొనే జపం.ఈ మూడింటిలో ఏ జపాన్ని అయినా చేయవచ్చు.

What Is The Japam- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) What Is The Japam--What Is The Japam-

ఉదయం సమయంలో జపం చేసినప్పుడు చేతులను నాభి వద్ద ఉంచాలి.మధ్యాహ్న సమయంలో జపం చేసినప్పుడు చేతులను హృదయం వద్ద ఉంచాలి.

సాయంత్రం సమయంలో జపం చేసినప్పుడు చేతులను ముఖానికి సమాంతరంగా పెట్టుకోవాలి.ఎండిన ఆవుపేడ పూసలు, రుద్రాక్షలు, తులసి మాల లేదా స్ఫటిక మాలలు జపం చేయటానికి మంచిదని పురాణాలు చెపుతున్నాయి.

జపం చేసే సమయంలో జపమాలను ఉంగరపు వేలు పై నుంచి చూపుడు వేలును ఉపయోగించకుండా బొటన వేలితో పూసలను లెక్కించాలి.

DEVOTIONAL