'గుర్తు' విషయంలో పవన్ ఆ విషయాలు గుర్తుపెట్టుకోవడంలేదా ..?

జనసేన పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని విధాలా సన్నద్ధం అవుతోంది.ఖచ్చితంగా ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.

 What Is The Janasena Party Sibal In 2019 Elections-TeluguStop.com

తరుచు ప్రజల్లో తిరుగుతూ పార్టీని అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రజల్లోకి పవన్ తీసుకెళ్లాడు.మొదట్లో జనసేన ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు మిగతా పార్టీలను భయపెట్టే స్థాయిలో జనసన రాజకీయంగా పురోగతి సాధించింది.అయితే… కొన్ని విషయాల్లో మాత్రం ఆ పార్టీ ఇంకా తప్పటడుగులు … ముందు చూపు లేకుండా వ్యవహరిస్తూ తప్పు చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి అటూ ఇటుగా ఆరేళ్లవుతోంది.జనసేన పార్టీ గుర్తేమిటి.?.అసలు అలాంటి ఆలోచన ఏమైనా చేశారా.? .ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా కాలం కిందట ప్రచారం జరిగినప్పుడు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీనే అనే పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ముందస్తు వస్తాయని ఊహించలేదని.అందుకే పోటీ చేయడం లేదన్న కారణం చూపిస్తున్నారు.

మరి ఏపీ ఎన్నికల వచ్చే సమయానికి అయినా .గుర్తు గురించి పవన్ ఆలోచిస్తాడా అనే అనుమానం కలుగుతోంది.ఇప్పుడు కాకపోయినా.ఏపీ ఎన్నికల సమయానికైనా పార్టీ గుర్తు కోసం.ఈసీ దగ్గరకు పరుగెత్తాల్సిందే కదా… ఇప్పటి వరకు కనీసం పార్టీ గుర్తు కోసం పవన్ పెద్దగా దృష్టి పెడుతున్నట్టు కనిపించడంలేదు.

ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే కానీ, ఎన్నికల నాటికి జనసేన కు ఓ గుర్తు వస్తుంది.ఆ దిశగా అడుగులు వేయకపోతే, పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా, ఉమ్మడి గుర్తు మాత్రం రాదన్నది నిజం.గతంలో ప్రజారాజ్యం పార్టీ గుర్తు విషయంలోనూ ఇదే జరిగింది.

ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఎన్నికల గుర్తు .సుప్రీంకోర్టుకు వెళ్తే కానీ.ఫైనల్ కాలేదు.అప్పుడే ఉమ్మడి గుర్తు వచ్చింది.అప్పుడు కూడా.చివర్లో రైలింజన్ గుర్తును ఎంచుకున్నారు.

ఆ గుర్తు దెబ్బకొట్టిందని తర్వాత ఊదయించే సూర్యుడి గుర్తుకు మారారు.ఆ అనుభవాలతోనైనా పవన్.

గుర్తు కోసం.సీరియస్‌గా ఎందుకు ప్రయత్నించడం లేదో ఫ్యాన్స్‌కు అర్థం కావడం లేదు.

ఇప్పటికే పార్టీ గుర్తు కనుక తెచ్చుకోగలిగితే… క్షేత్ర స్థాయిలో పార్టీ గుర్తు ను తీసుకెళ్లడానికి వీలయ్యేది.ఒక వేళా ఎన్నికల సమయానికి గుర్తు తెచ్చుకుంటే… అప్పటికప్పుడు ప్రజల్లోకి ఆ గుర్తు తీసుకెళ్లడం కష్టమవుతుంది.

పవన్ ముందు ఈ విషయాలపై దృష్టిపెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube