నెక్స్ట్ ఏంటి ? జనసేన ఫ్యూచర్ ఏంటి ?

అత్యంత వేగంగా బులెట్ ట్రైన్ లా దూసుకొచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంత స్పీడ్ గా రాజకీయాల్లో చక్రం తిప్పాలని వచ్చిందో అంతే స్పీడ్ గా చాగేడు ఫలితాలను చవిచూసి చతికల బడింది.రాజకీయాల్లో మార్పు తీసుకొస్తా అని పవన్ చెప్పిన మాటలు, ఆ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయాయి.

 What Is The Future Plan Of Janasena-TeluguStop.com

అందుకే ఒక్క సీటుకే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.ఇది నిజంగా ఆ పార్టీ అభిమానులకు, పవన్ కు రుచియించని అంశం.

ఎందుకంటే కనీసం పూర్తి స్థాయిలో అధికారం దక్కించుకోలేకపోయినా ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా తమ మద్దతు తప్పనిసరిగా అవసరం అవుతుందని అప్పుడు కింగ్ మేకర్ అవుతామని భావించారు.కానీ అవేమి జరగలేదు.

ఇప్పుడు జనసేన రాజకీయ భవిష్యత్తు ఏంటో కూడా అర్ధంకాని అయోమయ పరిస్థితి నెలకొంది.

జనసేన పార్టీ అధినేత పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా ఒక్క‌చోట కూడా గెల‌వ‌లేక‌పోయాడు.

దీన్ని బ‌ట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీని ప్ర‌జ‌లు ఎంత తిప్పికొట్టారో అర్థం చేసుకోవ‌చ్చు.అయితే ప‌వ‌న్ ఒక్క‌డైనా గెలిచుంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు.కానీ ఇప్పుడు దానిపై విచారించి లాభం లేదు.పొలిటికల్ ఫెయిల్యూర్ తరువాత పవన్ సినిమాలవైపు మళ్లుతారని అంతా భావించారు.

కానీ పవన్ మాత్రం వెళ్లి మ‌ళ్లీ సినిమాలు చేసుకుంటాన‌ని అనుకోవ‌డం పొర‌పాటే అంటున్నాడు.తాను ఖచ్చితంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే వాళ్ల‌తోనే, వాళ్ల కోస‌మే ఉంటాన‌ని, వాళ్ల సమ‌స్య‌ల కోసం పోరాడ‌ట‌మే ప‌నిగా పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెబుతున్నాడు పవన్.

-Telugu Political News

ఈ ఐదేళ్లపాటు వైసీపీ అధికారంలో ఉంటుంది.తమకు ఉన్న ఒకే ఒక్క సీటుతో పవన్ పార్టీ అసెంబ్లీ లో అడుగుపెడుతుంది.ఇక ఈ ఐదేళ్లు పార్టీని దిగ్విజయంగా నడపగలగడం అంటే కట్టి మీద సామే.కానీ 2024 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన శ‌క్తిగా జ‌న‌సేన మారుతుంద‌నే న‌మ్మ‌కం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎక్కువగా పెట్టుకున్నాడు.

అప్ప‌టి వ‌ర‌కు ఎలాగూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే వాళ్ల స‌మ‌స్య‌ల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు.ఈ లోపున అనేక విమర్శలు, నిందలు ఆ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప‌వ‌న్‌కు ఇప్పుడున్న బ‌లం బ‌ల‌గం అంతా అభిమానులే.అయితే వాళ్లే కాకుండా ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ని న‌మ్మితేనే ప‌వ‌న్ కోరుకున్న మార్పువస్తుంది.

పవన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube