ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవడంతో పాటు, ఈ చేరికల ద్వారా తన గ్రాఫ్ పెంచుకుని కాంగ్రెస్ హై కమాండ్ పెద్దల వద్ద తన బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.అందుకే ఒకవైపు చేరికలపై దృష్టి పెట్టడంతో పాటు, ఏపీ అధికార పార్టీ వైసీపీని ( YCP )టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
వైసిపిని స్థాపించి ఆ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ పడ్డ కష్టంలో షర్మిల కూడా కీలకంగా వ్యవహరించారు.అయితే ఇప్పుడు రాజకీయంగా వైసిపి విరోధిగా మారడంతో షర్మిల కూడా తన అన్న విషయంలో మొహమాటాన్ని పక్కనపెట్టి విమర్శలు చేస్తున్నారు.
వైసీపీలోని అసంతృప్త నాయకులందరినీ కాంగ్రెస్ లో చేర్చుకుని తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( MLA Alla Ramakrishna Reddy )షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా వైస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కీలక నేతలందరినీ కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే విశాఖ జిల్లా కీలక నేత, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ( Konatala Ramakrishna ) ఇంటికి షర్మిల వెళ్లారు.
ఆయనతో భేటీ అయ్యారు.అనేక రాజకీయ అంశాల పైన చర్చించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్( Congress ) లో చేరాల్సిందిగా కొణతాల రామకృష్ణను షర్మిల ఆహ్వానించినట్లు సమాచారం.అయితే ఇప్పటికే రామకృష్ణ జనసేనలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు.దీంతో ఇప్పుడు షర్మిల ఆయనను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించినా… కొలతల అనుచరులు మాత్రం జనసేనలోనే చేరాలని, టిడిపి, జనసేన కూటమి తప్పకుండా ఏపీలో అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ లో చేరినా ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారట.దీంతో ఈ విషయంలో కొణతాల రామకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే కొణతాల రామకృష్ణ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలంగా కీలకంగా వ్యవహరించారు.వైస్ మరణాంతరం జగన్( jagan ) స్థాపించిన వైసీపీలో చేరి జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు 2014లో వైఎస్ విజయమ్మ విశాఖలో ఎంపీగా పోటీ చేయడం వెనక కొణతాల రామకృష్ణ ఉన్నారు.జగన్ తో విభేదాలు ఏర్పడిన తరువాత వైసీపీకి రాజీనామా చేసారు.
అప్పటి నుంచీ రాజకీయంగా వెనుకబడ్డారు.పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు.
జనసేనలో చేరాలనుకుంటున్న సమయంలో షర్మిల కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించడంతో ఆయన ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.