సీబీఐ దూకుడుకు జగన్ ఢిల్లీ యాత్ర కు లింకేంటి ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బిజెపి తను స్టాండ్ మార్చుకుంటే కనిపిస్తోంది.గత ఎన్నికల ముందు జగన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించిన బిజెపి చంద్రబాబుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో వైసిపి అధికారంలోకి వచ్చేందుకు అనేక రకాలుగా సహాయపడింది.

 What Is The Connection Between Cbi And Jagan Delhi Tour-TeluguStop.com

కేంద్రంతో బీజేపీ దోస్తీ సజావుగా సాగుతుంది అని అంతా అనుకుంటున్న బిజెపి వైఖరిలో మార్పు మొదలైంది.తమకు జగన్ కూడా శత్రువే అన్నట్టుగా ఏపీ బీజేపీ నేతలు భావిస్తూ ఒక్కసారిగా మారిపోయాయి.

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుని ఇప్పటికే జగన్ తలకు మించిన భారం అయినా పథకాలను ప్రకటించారు.ఆ విషయంలో ప్రస్తుతం కేంద్రం సహకారం అంతంత మాత్రంగానే ఉంది.

అందుకే జగన్ మాత్రం బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడంలేదు.

Telugu Ap Bjp, Jagan, Cbi Jagan Delhi-

  బీజేపీ నాయకులు వైసీపీని ఉద్దేశించి ఎంత ఘాటు వ్యాఖ్యలు చేసినా జగన్, ఆ పార్టీ నాయకులు సైలెంట్ గానే ఉండి పోతున్నారు తప్ప బీజేపీని విమర్శించే సాహసం అయితే ఎక్కడా చేయడంలేదు.బిజెపి కి ప్రస్తుతం ఉన్న మెజారిటీ దృష్ట్యా ఆ పార్టీతో వైరం పెట్టుకోడానికి ఎవరు సాహసం చేయడం లేదు.దీన్నే అదునుగా తీసుకుని బిజెపి తమకు పట్టు తక్కువ ఉన్న ప్రాంతాల్లో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం ఏపీ విషయాన్ని చూసుకుంటే వైసిపి ప్రభుత్వంపై బిజెపి నాయకులు ఫైర్ అయిపోతున్నారు.ఇవి కాకుండా బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న తీరు బిజెపి నాయకులకు రుచించడం లేదు దీంతో ఇప్పుడు జగన్ పై సి.బి.ఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు చూస్తున్నట్టు కనిపిస్తోంది.

Telugu Ap Bjp, Jagan, Cbi Jagan Delhi-

  ఇటీవల జగన్ కోర్టుకు హాజరయ్యే విషయం తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సి.బి.ఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.జగన్ పిటిషన్ విచారణార్హం కాదని దానిని కొట్టివేయాలంటూ పిటిషన్ వేశారు.

జగన్ ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉండడంతో సాక్షులను ప్రభావితం చేస్తారని ఆ పిటిషన్ లో సి.బి.ఐ పేర్కొంది.ప్రస్తతుం సీఎంగా ఉన్న జగన్‌కు ఉన్న వనరులతో 275 కి.మీ.లు ప్రయాణించడం పెద్ద కష్టమేమీ కాదు.గతంలో ఎంపీగా ఉన్న జగన్ సాక్ష్యాల్ని తారుమారు చేసే రాజకీయ, ఆర్థికబలం ఉందనే అరెస్టు చేశామని సీబీఐ పేర్కొంది.సీబీఐ వాదనల అనంతరం న్యాయస్థానం విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఈ కేసుల నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube