ఆర్టీసీ కార్మికుల సమ్మె, తొలగింపుపై కేంద్రం స్పందన ఏంటో?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో నెలకొన్న సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తులను తొలగించడంతో పాటు, వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించాలంటూ ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

 What Is The Central Governament Reaction About Rtc Employes Strike-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆర్టీసీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది.అసలు కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి ఆరా తీసిందా అంటూ కొందరిలో అనుమానాలు కలుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర హోం శాఖ మరియు పీఎంఓలు గవర్నర్‌ నుండి సమాచారంను సేకరించినట్లుగా తెలుస్తోంది.వేచి చూసే దోరణితో కేంద్ర ప్రభుత్వం ఉంది.

కేసీఆర్‌ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే బీజేపీకి ప్లస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో కూడా ఇలా సైలెంట్‌గా ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర ముఖ్య నాయకుల నుండి సమాచారం తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలస్యంగా జోక్యం చేసుకుంటే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారట.అందుకే బీజేపీ అధినాయకత్వం మరియు ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube