బోయపాటి మరీ కన్ఫ్యూజన్‌ లో ఉన్నట్లున్నాడే

యాక్షన్‌ సినిమా ల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో ప్రస్తుతం అఖండ సినిమా రూపొందుతుంది.బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అఖండ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

 What Is The Boyapati Srinu Next Movie After Akhanda  Movie, Akhanda, Allu Arjun-TeluguStop.com

వారం రోజుల షెడ్యూల్‌ తో సినిమా ను ముగించబోతున్నారట.ఈనెల 13 నుండి షూటింగ్‌ ను మొదలు పెట్టి ఈ నెల చివరి వరకు ఫస్ట్‌ కాపీని రెడీ చేసి వచ్చే నెలలో దసరా కానుకగా విడుదల చేయడం దాదాపుగా ఖాయం.

కనుక అఖండ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వం వహించబోతున్న తదుపరి సినిమా ఏంటీ అనేది చర్చనీయాంశంగా మారింది.అఖండ సినిమా సక్సెస్ అయితే వెంటనే పెద్ద సినిమా లు ఆయన ఖాతాలో పడటం ఖాయం అంటున్నారు.

కనుక ఆయన సినిమా ల కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

మొన్నటి వరకు రవితేజతో ఈయన సినిమా అన్నారు.

ఆ తర్వాత మరో హీరోతో ఈయన సినిమా అంటున్నారు.ఇప్పుడేమో అల్లు అర్జున్‌ నుండి బోయపాటికి క్లారిటీ వచ్చిందని అంటున్నారు.

అల్లు అర్జున్‌ తో ఇప్పటికే సరైనోడు సినిమాను తెరకెక్కించిన బోయపాటి తదుపరి సినిమా ను మళ్లీ బన్నీతోనే చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.బన్నీ వంటి స్టార్ తో చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలో టాప్ లో నిలిచే అవకాశం ఉంటుంది అంటూ ఆయన నమ్మకంతో ఉన్నాడు.

Telugu Akhanda, Alluarjun, Balakrishna, Boyapati, Boyapati Srinu, Tollywood-Movi

అందుకే బోయపాటి తదుపరి సినిమా ను బన్నీతో చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు కాని అభిమానులు మాత్రం బోయపాటి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.ఎందుకంటే బన్నీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వడానికి వచ్చే ఏడాది చివరి వరకు పడుతుంది.కనుక ఇప్పట్లో ఆయనతో సినిమా సాధ్యం కాదు.అందుకే బోయపాటి కన్ఫ్యూజన్‌ లో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నాడేమో అంటూ విమర్శలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube