హుజూర్‌ నగర్‌లో బీజేపీ స్థానం ఏంటీ?

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న విషయం తెల్సిందే.గతంలో ఎప్పుడు లేని విధంగా పార్లమెంటు స్థానాలను ఒంటరిగా దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు హుజూర్‌నగర్‌ స్థానంపై జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

 What Is The Bjps Position In Huzur Nagar Bjp Planing In Theis City-TeluguStop.com

నిన్న మొన్నటి వరకు శంకరమ్మను బీజేపీలోకి లాక్కుని ఆమెకు సీటు ఇచ్చి గెలిపించాలని భావించారు.ఆమె కూడా బీజేపీ వైపుకు అడుగులు వేసింది.

విషయం తెలుసుకున్న కేటీఆర్‌ వెంటనే స్వయంగా శంకరమ్మకు ఫోన్‌ చేసి భవిష్యత్తులో ఎమ్మెల్సీ లేదా మరేదైనా నామినేటెడ్‌ పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చాడు.దాంతో ఆమె టీఆర్‌ఎస్‌కే జై అంది.

నేడు బీజేపీ అభ్యర్థి విషయంలో చర్చించేందుకు పార్టీ నాయకులు చర్చించారు.రాష్ట్ర ముఖ్య నాయకులు ఎవరైనా అక్కడ పోటీ చేయాలని మొదట భావించారు.కాని పోటీ చేసి పరువు పోగొట్టుకునేందుకు ఏ రాష్ట్ర నాయకుడు కూడా ఆసక్తిగా లేడు.దాంతో స్థానికులకే ఎవరికో ఒకరికి సీటు కట్టబెట్టి మమ అనిపించాలని నిర్ణయించుకున్నారు.

హుజూర్‌నగర్‌లో బీజేపీ మూడవ స్థానంకే పరిమితం అయ్యే అవకాశం ఉందని స్థానిక నాయకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఎక్కువ హడావుడి లేకుండా బీజేపీ సైడ్‌ అవ్వాలని గట్టి అభ్యర్థిని నిలపడం లేదు.

పోటీ ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మద్య ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube