జెనీలియా.ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
తన అందంతో పాటు నటనతో సౌత్ జనాలకు ఎంతో దగ్గర అయ్యింది.బాయ్స్ అనే తమిళ సినిమాతో వెండి తెరపై తళుక్కున మెరిసింది ఈ క్యూట్ బ్యూటీ.
తెలుగులో సత్యం సినిమాతో అడుగు పెట్టింది.కొంత కాలం పాటు తెలుగు, తమిళ జనాలను తన అందాలతో మతి పోగొట్టేసింది.
తెలుగు ఇండస్ట్రీలో సత్యం తర్వాత రెడీ, ఢీ, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.
అటు తన సినిమా కెరీక్ పీక్స్ లో వుండగానే ప్రియుడు రితేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకుంది.
అయితే వీరిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.జెనీలియాతో పోల్చితే రితేష్ సుమారు 9 ఏండ్లు పెద్దవాడు.అటు వీరి ప్రేమ ఓ సినిమా కథను తలపిస్తుంది.నిజానికి వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు.
విషయం రితేష్ కుటుంబ సభ్యులకు తెలిసింది.హిందూ సంప్రదాయం అంటే ఎంతో గౌరవం ఉన్న ఆయన కుటుంబ సభ్యులు క్రిస్టియన్ అమ్మాయి జెనీలియాతో పెళ్లికి ఒప్పుకోలేదు.
చాలా రోజులుకష్టపడి తన కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాడు రితేష్.జెనీలియాతో పెళ్లికి ఓకే చెప్పించాడు.అటు జెనీలియా మాత్రం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.దీంతో రితేష్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.రితేష్ కుటుంబ సభ్యులు జెనీలియాకు నచ్చచెప్పడంతో పెళ్లికి ఓకే చెప్పింది.ప్రస్తుతం వీరికి ఒక బాబు వున్నాడు.