స్టార్ హీరోలే థియేటర్స్ ని నమ్మడంలేదు.. ఇలా అయితే ఎలా?

కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది స్టార్ హీరోలు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 What Is Star Heroes Donot Believe In Theatres Star Heros, Movie Release, Ott Pla-TeluguStop.com

కరోనా మహమ్మారితో థియేటర్స్ మూతపడ్డ విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో, థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకుంటున్నాయి.

దీనితో బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు విడుదలయ్యి, అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్య వంశీ సినిమా ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు చేసింది.

అలాగే హీరో రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా కూడా నూరు కోట్లకు పైగా వసూలు చేసింది.ప్రేక్షకులు కూడా థియేటర్లకు బాగానే వస్తున్నారు.అయినప్పటికీ కొందరు హీరోలు సినిమాలను నేరుగా థియేటర్లలో విడుదల చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం దృశ్యం 2.

ఈ సినిమా నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడం చాలా మంది బయ్యర్లకు ఇష్టం లేదు.

Telugu Drushyam, Ott Platm, Padanna, Rajinikanth, Heros, Suriya, Venkatesh-Movie

ఎందుకంటే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి.అంతేకాకుండా ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం కూడా ఉంది.దీంతోపాటు మరొకవైపు తమిళ హీరో సూర్య తీసుకున్న నిర్ణయాలు కూడా అక్కడ థియేటర్ల సంఘానికి కోపం తెప్పిస్తున్నాయి.మలయాళంలో మోహన్ లాల్ సినిమాలకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అలాంటివి సూపర్ స్టార్ రాబోయే ఐదు సినిమాలను ఓటీటీలో 500 కోట్లకు బేరం పెట్టాడు.అయితే మేము ఉన్నాం అని ధైర్యం చెప్పాల్సిన స్టార్ హీరోలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే థియేటర్స్ వ్యవస్థ నాశనం అయిపోతుందన్న ఆలోచన అందరిలో వస్తోంది.

మరి ఈ విషయంపై స్టార్ హీరోలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube