శివతాండవం అంటే ఏమిటి.. శివుడు ఎందుకలా చేస్తాడు?

ఓ చేత త్రిశూలం, మరోచేత డమరుకం పట్టుకొని.ఒళ్లంతా విభూది రాసుకొని… ఎర్రటి శిరోజాలతో పార్వతీదేవితో కలిసి చేసే నృత్యమే శివతాండవం.

 What Is Shivatandavam , Devotional , Parama Shivudu, Sivathandavam, Shivudu , Te-TeluguStop.com

శివుని డమరుకం నుంచి వెలువడ్డ శబ్దాలే భాషగా మారిందని సనాతనధర్మం చెబుతోంది.శివతాండవంలో ఉదయించే సూర్యుడు, సముద్రపు ఘోష, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు, మెరుపుల ధ్వనులుంటాయి.

ఆయనకున్న నాలుగు చేతులు నాలుగు దిక్కులను సూచిస్తాయి.భగవంతుడు సర్వాంతర్యామి.

భగవంతుని చేతులలో ఒక దానిలో డమరుకం ఉంటుంది.దీని ద్వారా నాదం వెలువడుతుంది.

అందుకే తత్వశాస్త్రంలో ఉమాపతిని నాద బ్రాహ్మణ అంటారు.మరో చేయి అర్ధచంద్రముద్రలో కనిపిస్తూ జ్వలించే అగ్నిని కలిగివుంటుంది.

 అగ్ని అన్నింటిని దహించివేస్తుంది.మరో చేయ్యి  అభయ ముద్రలో ఉంటుంది.

సమస్త ప్రాణకోటికి అభయాన్నిస్తుంది. మరో చేయ్యి  స్వామి పాదాలను సూచిస్తుంది.ఆయన చరణాలను నమ్ముకుంటే చాలు రక్షణ లభిస్తుంది.

ఆ నృత్యంతోనే రక్షణ

శివతాండవం లోక సంక్షేమాన్ని కోరి చేసే నాట్యం.కాల్పనిక మాయలో ఉన్న మన జీవితాలను విముక్తి చేస్తుంది.ఆ నృత్యంతో అంధకారంతోపాటు లోక కంటక శక్తులు నశిస్తాయి.ప్రాణులు జ్ఞానశుద్ధి సాధించాలంటే చుట్టూ ఉన్న అజ్ఞానం నశించాలి.అందుకే ఆ పరమేశ్వరుని తాండవంతో చీకట్లు తొలగిపోతాయి.

శివతాండవ స్తోత్రం…

Telugu Devotional, Parama Shivudu, Shivathandavam, Shivudu-Telugu Bhakthi

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ

ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర

Telugu Devotional, Parama Shivudu, Shivathandavam, Shivudu-Telugu Bhakthi

స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే

మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః

శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా

నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః

కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక

ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ

నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్

కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః

నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః

ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా

వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో

ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో

తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో

సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్

విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్

విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః

శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube